ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ చనిపోయింది…300 కేజీలు తగ్గిన ఆమె చనిపోడానికి కారణం ఏంటి?

ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ ఎమన్ అహ్మద్ చనిపోయింది. ముంబై నుంచి అబుదాబి వెళ్లి అక్కడి చికిత్స పొందుతున్న ఎమన్.. ఈ ఉదయం ఆస్పత్రిలోనే కన్నుమూసినట్లు వెద్యులు ప్రకటించారు. 20 మంది డాక్టర్ల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించిందని.. 500 కేజీల బరువు నుంచి సగం తగ్గినట్లు చెబుతున్నారు డాక్టర్స్. భారీ బరువు కారణంగా ఎమన్ అహ్మద్ ఇప్పటికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్ని, నరాల సంబంధం వ్యాధులతో కూడా బాధపడుతుంది. ఈ ఉదయం కిడ్ని ఇన్ఫెక్షన్ తోపాటు హార్ట్ ఎటాక్ రావటంతో చనిపోయింది.

ఈజిప్ట్ కు చెందిన 36 ఏళ్ల ఎమన్ అహ్మద్ 504 కేజీల బరువుతో ప్రపంచంలోనే భారీ బరువు ఉన్న మహిళగా గుర్తింపు పొందింది. చికిత్స కోసం ప్రత్యేక కార్గో విమానంలో అలగ్జాండ్రియా నగరం నుంచి ముంబై తీసుకొచ్చారు. సైఫి ఆస్పత్రిలో 2017 మే 4వ తేదీన చేరిన ఎమన్.. బెరియాట్రిక్ సర్జన్ ద్వారా 300 కేజీలకు తగ్గారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. నెల రోజుల క్రితం ఎమన్ ను ముంబై నుంచి అబుదాబికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు వెల్లడించారు వైద్యులు.

Comments

comments

Share this post

scroll to top