జాతీయ మహిళా కమీషన్ చెంతకు చేరిన మరో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ! 8 యేళ్ళకే పెళ్లి, విడాకులు!?

‘బాధ వెనుక కన్నీళ్లు ఉంటాయి. ఆ కన్నీటికి కారణం కూడా తెలియని వయసు’ ఆమెది. ఉత్తరప్రదేశ్ లోని శ్రవిష్టి జిల్లాలో గల అనిల్ మంగ్రే కూతురు ఫాతిమా మంగ్రే. ఫాతిమా 4 సంవత్సరాల వయసులోనే, 10 సంవత్సరాల అనిల్ బక్రీదికి ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. బొమ్మల పెళ్లిలా ఆ వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. 4 ఏళ్ళ వయసులోనే పెళ్ళైన ఫాతిమాను, 8 సంవత్సరాలు నిండాక అబ్బాయి ఇంటికి తీసుకెల్లాలని ముందుగా అనుకున్నారు. అప్పటి వరకు తల్లితండ్రుల సమక్షంలోనే ఆమె జీవిస్తుండేది. ఫాతిమాకు 8 సంవత్సరాలు పూర్తికావడంతో, అనిల్ బక్రీది మరియు అతని కుటుంబ సభ్యులు ఫాతిమాను తీసుకెళ్లడానికి వచ్చారు.తన కూతురిని అప్పుడే మెట్టింటికి పంపించడం ఇష్టంలేని ఫాతిమా తండ్రి, తన కూతురికి 18 ఏళ్ళు నిండాకే మెట్టింటికి పంపిస్తానని అప్పటివరకు తన బిడ్డ తన దగ్గరే ఉంటుందని వారి నిర్ణయానికి అడ్డుచెప్పాడు.

295585997

‘చాలా చిన్న వయసులోనే ఇలా బాల్యవివాహం  చేసి తప్పు చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ విధంగా పెళ్ళిళ్ళు చేయడం ఎంతో బాధాకరం. ఇప్పుడు నా కూతురిని కాపాడుకోవడం నా బాధ్యత అంటూ’ ఆవేదనగా ఫాతిమా తండ్రి చెప్పుకొచ్చాడు.  అయితే ఫాతిమా తండ్రి అనిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు కుటుంబాలలోనూ వాగ్వాదానికి దారితీసింది. అందుకని తన కూతురికి ఆ బాల్యవివాహం నుండి విముక్తి చేయించడానికి విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఈ విషయం జాతీయ మహిళా  కమీషన్ వద్దకు చేరింది. ఫాతిమాకు 2013లో అనిల్ బక్రిది నుండి విడాకులు తీసుకుంది. 8 ఏళ్ళ వయసులోనే విడాకులు తీసుకున్న మహిళగా ఫాతిమా పేర్కొనబడింది.
wall-thumbnail35711956b4716a95073
విడాకుల అనంతరం ఫాతిమా తండ్రి అనిల్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికైనా నా తప్పేంటో తెలుసుకున్నాను. ఆ వయసులో పెళ్లి చేయడం చాలా పెద్ద తప్పు. మా గ్రామంలో సామాజిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలా ఎంతోమంది బాల్యవివాహాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.  నా కూతురికి చిన్న వయసులోనే బాల్యవివాహం చేశాను, ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నాను. ఇప్పటి నుండి నా కూతురు నా సంరక్షణలో హాయిగా సంతోషంగా జీవిస్తుంది. తనకు ఎటువంటి కష్టాన్ని రానివ్వను. అని భావోద్వేకంగా అన్నాడు.
wall-thumbnail35711956b4716a95073-tile
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) లెక్కల ప్రకారం… 32.9% అమ్మాయిలు ఇక్కడ కలిగి ఉంటే 18 సంవత్సరాలలోపే పెళ్లి అయిన వారు దాదాపు 22.1% ఉన్నారట. శ్రవిష్టిలో పెళ్ళిళ్ళు పెద్ద వయసులో జరగడం చాలా అరుదుగానే జరుగుతున్నాయట.  ఈ ప్రాంతంలో మగవారు 72.6 %, ఆడవాళ్లు 82.5% కు చిన్న వయసులోనే బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ గణాంకాల ప్రకారం అమ్మాయిలు అక్షరాస్యత శాతం కేవలం 19% మాత్రమే. ఇప్పటికైనా అక్కడ మార్పుకోరుకునే వారు అక్కడ ఉన్నారో లేదో ప్రభుత్వాలు ఈ విషయమై ఏం చెబుతున్నారో మరి.

Comments

comments

Share this post

scroll to top