“అర్జున్ రెడ్డి” పై సెలెబ్రిటీల ట్వీట్లు పక్కన పెట్టండి..! కొందరు మహిళలు ఏమంటున్నారో చూడండి..!

అర్జున్ రెడ్డి పోస్టర్ పై పెద్ద రచ్చే జరిగింది.విజయ్ దేవరకొండ ఫ భాష సినిమాకి మరింత నెగటివ్ పబ్లిసిటీ తెచ్చింది. ఎ సర్టిఫైడ్ సినిమా అంటేఎలా ఉంటుందో భయపడ్తుూ వెళ్లిన జనం చాలామంది బాగుంది అనే టాక్ ఇస్తే..అదొక బ్లూ ఫిల్మ్ లాంటిది అని సర్టిఫై చేసినవారూ ఉన్నారు..ఇలాంటి సినిమా తీసి పిల్లల్ని పాడు చేస్తారా అని మండిపడిన వారూ ఉన్నారు.ముఖ్యంగా సినిమా అంత అశ్లీలంగా ఉంటే ముందుగా మండిపడేది ఆడవాళ్లే.. కానీ వాళ్లు కూడా సూపర్ అంటున్ారంటే అశ్లీలతని మించి సినిమాలో ఏదో ఉంది..ఉంటే ఏంటది..ఆడవారి మాటల్లోనే సినిమాని మీరే చదవండి..

(Spoilers ahead)
“అర్జున్ రెడ్డి మగాళ్ల సినిమా అట. మనకెందుకులే.”

నిజం. పుట్టినరోజుకు బాయ్‌ఫ్రెండ్ టెడ్డీ బేర్, చాకొలేట్ బాక్స్ బహుమతివ్వాలనుకునే అమ్మాయిలకి కాదు. “నన్ను ‘బాగా’ చూసుకోవాలి. కళానికేతన్లో షాపింగ్‌కి తీసుకెళ్ళాలి, నా స్నేహితురాళ్ళందరికీ నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని వీడిని చూపించాలి” అనుకునే అమ్మాయిలకి అస్సలు కాదు.

ప్రపంచంలో విచ్చలవిడిగా నడుస్తున్న “Host – Parasite” బంధాలమీద Neon Glitter Paint తో పూల పూల క్యాలిగ్రాఫీలో రాసుకున్న “ప్రేమ” అనే పదాన్ని యాసిడ్‌తో కడిగేసిన వాడు వీడు.

వీడున్నాడే?
వీడితో జీవితం కేక్‌వాక్ యేమాత్రం కాదు. వీడి కోపం, వీడి రియాక్షన్స్, వీడి ఇంటెన్సిటీలకి “తిక్క” అని పేరు పెట్టాలనిపిస్తే అక్కడే ఆగిపోండి. “సెకండాఫ్ కామెడీ కేక” సినిమాలు చాలా వస్తాయి మీకోసం.

అణువణువూ మనసులోంచి రిసొనేట్ అవ్వగలిగిన అమ్మాయిలెవరైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా చూడొచ్చు. గర్వంగా తాము దాటుకొచ్చినవన్నీ తలుచుకోవచ్చు. తమ చలి రాత్రుల్లో ఎర్రటి నక్షత్రంలా వెలిగే అచ్చమైన, స్వచ్ఛమైన, నిత్యమైన ప్రేమని పోల్చుకోవచ్చు.

వీడున్నాడే…
కవ్వించి రెచ్చగొట్టి తన్నులు తినీ తినిపించిన శత్రువు దగ్గర కాలప్రభావం వల్ల కలగబోయే తన అశక్తతని గుర్తించి “ఆ పిల్లకేమైనా ఐతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ బాధపడేది నేను. దాన్నొదిలెయ్యరా… మాటివ్వరా నాకు” అని ప్రాధేయపడి వెక్కి వెక్కి ఏడుస్తాడు..

రక్తం చూస్తూ, మాంసం కోస్తూ మొద్దుబారివుండాల్సిన సర్జన్, తెగిన ప్రియురాలి పాదానికి కుట్లేసేందుకు సూదిగుచ్చటమనే ఊహ కూడా భరించలేడు. ఉతికిపెట్టిన తన నైట్‌డ్రెస్సులు ఆరేస్తున్నప్పుడు “ఎలాటివాడిని నీకోసం ఎంత పని చేస్తున్నానో చూశావా?” అనే అహంకారం బహుశా చూసేవాడికి కలుగుతుందేమో కానీ వాడిక్కాదు.

కేవలం తనని చూడటం కోసమే ఆమె దూరాభారాలు దాటుకొచ్చిందన్న ఓపలేని సంతోషాన్ని కోపంగానే చూపిస్తాడు. భుజమ్మీద్ద బరువైన హ్యాండ్‌బ్యాగ్ మిగిల్చిన ఎర్రటి వాతని ముందు గమినించి కళ్లు తడిచేస్కుంటాడు. అర్థమౌతున్నాడా వీడు మీకు?

ఆమెని గుర్తుతెచ్చే దేన్నైనా సరే “ముద్దువెట్కునేంత” తీవ్రత. వొకేవొక్క స్త్రీ మీదకి ముంచుకొచ్చే చలం ప్రేమలేఖల ఉప్పెన.

తనకీ ప్రేయసికీ మధ్య ఉన్నదాన్ని ఒప్పుకునేందుకు తీవ్రమైన denial లో కొట్టుకుంటూ, కేకలేస్తున్న తండ్రి దగ్గర “ప్రైవేట్ స్పేస్” గా మాత్రమే చెప్పే సంస్కారం ఉన్నవాడు.

ఆడవాళ్లని ఆబ్జెక్టిఫై చేసేవాళ్ళకి మాటల్తోనే తాట తీస్తాడు. “ఆడదానిగా పుట్టడం నీ ఖర్మ. నెలనెలా భరించాల్సిందే నెప్పిని.” అనేవాళ్ళని మరోమాట లేకుండా చీదరించుకుంటాడు.

ఊహించని ఒక రోజొచ్చి నిలువెల్లా కుదిపేశాక… చివర వెలుగుంటుందో ఉండదో తెలియకుండానే చీకటి సొరంగంలోంచి బయటికి నడుస్తున్నపుడు ఎదురైన ఆమె “Flesh and Blood” ని మిల్లీసెకండైనా ఆలోచించకుండా తనది అనేసుకోగలిగే లక్షల్లో ఒక్కడు. మిగిలిన 99,999 మందికీ ఇంకొక వందరోజులు అద్దంలో లీలగా కనిపించేసి మాయమౌతాడు.

“కార్యేషు దాసి…” ఆడాళ్ల శ్లోకం. ఇది నిజంగా మగాళ్ల సినిమా.

ఎన్ని జన్మల పుణ్యాలో ఫలిస్తే తారసపడతాడు. భరించగలిగే బరువు, త్రాణ ఉన్నాయనిపిస్తే ఒక్క అడుగుక్కూడా వెనక్కు వెయ్యొద్దు. జీవితం నింపుకుందుకు యే చెత్తా చెదారమూ ఏరుకునే పన్లేదప్పుడు.

#ArjunReddy – నిజాయితీపరుడు. యుద్ధవీరుడు. కేవ్‌మ్యాన్. ప్రేమికుడు.

— Santwana Chimalamarri
*******************************************

My Opinion & Views on ARJUN REDDY

The historic saga of DEVDAS & PARO revisited, retold and remembered in the most best and bold way possible !

The most unconventional, non stereotypical, no nonsense & no formula based film ! A realistic presentation of love between two people that goes through emotions, Sex, pleasure & pain. A pathbreaking film I should say ! I think it’s the first time ever that the Telugu audience could see something so raw and real. The make believe stereotypical fantasy films will soon take a back seat aftermath AR ! It has created a huge impact on the generation next movie goers. The boring and regular way of storytelling will no more be accepted and acknowledged.

You don’t find songs coming in suddenly and the group songs, duets and item numbers are a non sync here. Fights don’t happen just because they have to. They happen because the situation demands and these fights are natural and real without any artificial stunts attached !

The characterisation of AR is so intense, curt and non compromising that only Vijay Devarakonda can pull it off with that perfection ! Vijay and Shalini’s love is so deep and so real that they not only go for a premarital Sex, but also seem highly cool with PDA. They are neither meek nor scared to declare their relationship status to the society !

They even count the number of times they made love. Smooching for them happens naturally and that’s the way they express their love towards each other. There is not even an ounce of vulgarity anywhere inspite of a hundreds of smooches !

Vijay Devarakonda throws a challenge to all the image conscious heroes through his impeccable performance in a few scenes. After having an overdose of Liquor and drugging, he falls asleep and urinates in his pants with an uncontrolled bladder ! Would any image conscious actor do this ? No way ! Also when he is suddenly denied of an emerging sexual need, he drops a few ice cubes in his trouser to bring down the heat ! The director and Vijay believed that this truth has to be told and also told that Raw ! Hats off to their Conviction !

The director Sandeep Vanga seems to be an out and out feminist with such deep rooted opinions on women Rights, sexual choices, non objectification of women and gender equality issues. This is proved through a few scenes in the film. Vijay fires on a person who objectifies women. He is slapped many a times by Shalini for his uncontrolled anger. Both of them have and exhibit sexual desires and both go through pain. Both cry and both compliment each other.

The true essence of love is setting it free without any boundaries ! Only then one will know how intensely true it is and how dangerously deep it is ! Sandeep vanga is successful in portraying the lead characters in such a way that one is ought to empathise with both the characters at some point or the other.

A few dialogues are still not going out of my system. “democracy lo intha free spirited ga evvaru undaru”…. ” I like the way you breathe”…..”suffering is personal, let him suffer”. Background score is brilliant and emotions carried with it are very realistic.

Apart from the best things in the film, I felt somewhere that it’s too dark a reality that has been presented in the most crude way possible. As cinema is the most influential medium, I only hope the abusive language, the anger and the addiction of the protagonist is not perceived as a heroic act and emulated ! Other than this, I consider this as a huge Jerk to Telugu cinema and a Landmark Film ! Way to Go Sandeep Reddy Vanga & Vijay Devarakonda. You made Telugu cinema proud !

*********************************

చిన్న మెదడ్లు చితికిపోయేలాగా, మనోభావాలు ముక్కలయ్యేలాగా, ఒక్క ముక్క గ్రాంథికం వాడకుండా, ప్రతీ ముక్క అర్థమయ్యేలాగ పచ్చి తెలుగులో చెప్తున్నా అర్థంజేస్కోండి.

“అర్జున్ రెడ్డి” ఒక పిచ్చోడు. ప్రేమించిన పిల్ల కంట నీరు పెట్టుకుంటే, అందుకు కారణమైన వాడి మీద ఇపుడు రౌడీయిజం చూపించి, నాలుగు ఫ్యాక్షన్ డైలాగులు చెప్పి, ఎగిరి తన్ని వొదిలెయ్యకుండా, వాడి బలహీనత అయిన కోపాన్ని అణుచుకొని, నేను లేనపుడు ఆ పిల్లని వాడేమైనా చేస్తే ఎలాగా అని వాన్ని బతిమాలి, ఏమి చేయెుద్దని ఒట్టేయించుకున్నాడు చూడు పిచ్చోడ్రా వాడు !

బూతులొచ్చు కానీ, నీలా ఆడాళ్ళను ఆబ్జెక్టిఫై చేయనని వొట్టి మాటలతో చెల్లుమనిపించాడు చూడు..పిచ్చోడే.
“బుజ్జి, బంగారం అంటూ పార్కులు,షికార్ల ఓవర్ మెలోడ్రామా లేకుండా, తన కోసం వచ్చిన పిల్ల, భుజం మీది బ్యాగ్ బరువు ఎర్రటి అచ్చును తను మాత్రమే చూసి
బాధపడగలడు చూడు అందుకూ పిచ్చోడే !

విపరీతమైన ఫ్రస్ట్రేషన్లోనూ, ఈ హ్యాంగోవర్ లేకపోతే ఈపాటికి జీవితంలో ఏది సాధించబోయేవాడో తెలుసుకొని, “క్లినిక్” లోనే వేళ్ళాడుతున్న ఫ్రెండ్ కి ఇంకెన్నాళ్ళిలా వుంటావని కెరీర్ గైడెన్స్ ఇచ్చాడు చూడు..
తన బాధలో కలుపుకొని, “PMS” ని నెలలు నెలలు వాడే ఫీలవుతూ, ఎంత అపురూపంగా చూడాలో చెప్పేవాడు ఒకడున్నాడంటే వాడు పిచ్చోడే మరి !

దాచలేనంత ప్రేమని క్షణక్షణం “ముద్దు”గానే, స్వచ్ఛంగా చూపగలిగేవాడు, ఎవరి పక్కనో వుందనుకున్న ప్రేమించిన పిల్ల, మనసులో మాత్రం తనేనని, “ఫ్లెష్ అండ్ బ్లడ్” అంటూ “తండ్రిగా నన్ను చూపించు” అని నిక్కచ్చిగా అనగలిగేవాడు, మూస మెదళ్ళను లిబరలైజ్ చేసిన వాడు పిచ్చోడు కాక మరేమిటి !?

వొద్దండి మనకు..ఈ పిచ్చోడు మనకీ పిచ్చెక్కించి కొన్ని యుగాలు ముందుకు తోసేస్తాడు, మనమెప్పటికీ చేరుకోలేనంత ముందుకు తోసేస్తాడు.
ఎక్కువసేపు ముద్దు పెట్టుకున్న “గీతాంజలి”లు సకుటుంబ సపరివారంగా చూస్తూ, ఎక్కువసార్లు ముద్దుపెట్టుకోగానే అడల్ట్ సినిమా అనేసే మనకు ఇవి సరిపడవు, అందుకే చెప్తున్నా..చూడొద్దు.
కత్తులతో నరికి, గన్ లతో కాల్చి, ఎగిరి తన్ని, ట్రైన్లలోంచి తోసేసి, అణుచుకోలేని కోపాన్ని, నెగెటివ్ ఎమోషన్సి మనం చాలా క్యాజువల్ గా చూసేసి, కోపంలోనూ ముద్దుగా ప్రేమించగలిగే వాడి పాజిటివిటీ మన కళ్ళకు సరిపడదు..అస్సలు చూడొద్దు.

అర్జున్ రెడ్డి బూతు సినెమా కాదండి..న భూతో న భవిష్యతి అనగలిగే సినెమా..”న భవిష్యతి ” అన్నది ఇక సినెమాలు ఇలా రావని కాదు, అవి అందుకునేంత లిబరలైజ్ మనం రియాలిటీలో అవలేమని

PS : సినిమాలు చూడటమే తప్ప, వాటి గురించి ఇంతలా ఏనాడూ రాయాలనిపించని నా చేతే రాయించాడంటే, అర్జున్ రెడ్డి ప్రేమ పిచ్చోడు మాత్రమే కాదు, పడేయగలిగేంత పిచ్చోడు కూడా.. అందుకే చెప్తున్నా ఆ పిచ్చోడి సినెమా చూడొద్దు.

(“గీతాంజలి” సినెమా పోలిక ఇంటెన్షనల్ గా కాదు)

— Saritha Bhupathi

*******************************************

సినిమాలో దమ్మున్న అన్ని సీన్లు ఉండగా…ప్రమోషన్ వేరే విధంగా ఎందుకు చేసారో వారికే తెలియాలి..ఇకపోతే
.
ఒకవైపు నుండి చూస్తే.. ఒక పర్వర్టెడ్ లవ్ స్టోరీని సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ లవ్ స్టోరీగా నిలబెట్టింది రెండే సీన్లు ఒకటి ఇంటర్వెల్ ముందు అమ్మాయి వాడిని ఓన్ చేసుకుంటూ తాపత్రయపడే సీన్..రెండు క్లైమాక్స్ లో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషనల్ సీన్…
.
.

మరోవైపు చూస్తే..
అర్జున్ రెడ్డి నిజమైన ప్రేమికుడు..బర్త్ డే గిఫ్ట్ గా ముద్దు ఇస్తే అక్కడ బూతే చూసారు తప్ప ప్రేమ లోతు చూడలేదు..గిఫ్ట్ అంటే ఎంత ఖరీదైనదని కాదు,ఎంత ప్రేమతో ఇచ్చామని తెలిసేది ఇలాంటప్పుడే కదా..
.అర్జున్ కోపం గా ఉన్నప్పుడు బేబీ కూల్ ,నువ్ నాకు కావాలి అనే సీన్ లో అంత కొపం ఉన్నవాడికి భయపడకుండా వాడిని కూల్ చేయడానికి తను పడే తాపత్రయం..
.
.
ఢాబా పై పరుపు పరిచేటప్పుడు వాళ్లు అక్కడ కూడా అదే పనిలో ఉంటారనే ఊహించుకున్నారు తప్ప
వెన్నెలను చూస్తు వాళ్లు ఊసులు చెప్పుకుని ఉండుంటారని,లేదంటే వారి వారి భవిష్యత్ ల గురించి మాట్లాడుకుని ఉండుంటారని ఎంతమంది అనుకుని ఉంటారు..
.
.
ప్రీతి ఇంటి దగ్గర గొడవయ్యి వచ్చాక ..వాళ్లింట్లో నాకు నాది కావాలి అని వాడంటే..ఇప్పుడా అని అమ్మాయంటుంటేనే వాడు తలుపు గడియ పెట్టడంలో ..వాడొక సెక్స్ అడిక్ట్ అనుకున్నారు తప్ప..సెక్స్ అనేది కేవలం రెండు శరీరాల కలయిక కాదు అదొక అనిర్వచనియమైన ఫీలింగ్ ,రెండు శరీరాలనే కాదు రెండు మనసులను ముడివేసే ఏకైక అస్త్రం(ఇక్కడ ఏ వర్డ్ వాడాలో నాకు తెలియలేదు) .దాన్నికూడా బూతు గానే అనుకున్నారు..రెండు శరీరాలు ఇద్దరు మనుషులు ఒక ఆత్మగా కలిస్తేనే అలాంటి బంధం ఏర్పడుతుంది..ఆ బంధాన్ని అర్దం చేసుకోగలగాలంటే మనం అలాంటి బంధంలో ఉండాలి..
.
.
.సెక్స్ అడిక్టే అనుకుందాం.. ఆ అమ్మాయిని చూసేవరకు ఎంతమందితో ఉన్నాడు..కనీసం వాడి బైక్ కూడా ఎవర్నీ ఎక్కించుకోలేదు అని చెప్పకనే చెప్పారు గా..
భార్య పీరియడ్స్ తో బాద పడితే ఒళ్లో పడుకోపెట్టుకుని ,పక్కకు తిరిగి,కాళ్లు ముడుచుకుని పడుకో అని చెప్పే భర్తలెందరు.. ఆ అయిదురోజులు కూడా ఆ పని చేయ్..ఈ పని చేయ్ అని చెప్పేవారే నూటికి తొంబై తొమ్మిది మంది..
.
.
అమిత్ తో ప్రామిస్ చేసుకున్నాక అమ్మాయిని హగ్ చేసుకుని ఏడ్చే సీన్లో అబ్బా ఏమన్న హగ్ చేసుకున్నరా అనుకునే ప్రేక్షకులే తప్ప… వాళ్ల కళ్లలో కన్నీళ్లు ,ప్రేమని గమనించేదెందరు..
.
చాలా సిల్లీ థింగ్ గా అనిపించొచ్చు ఇది నీ బ్రషే కదా పర్లేదు అనే చిన్న సీన్.. ఆ సీన్ అర్దం కావాలంటే మనం నిజమైన ప్రేమలో ఉండాలి…ముద్దు పెట్టుకునే సీన్ ప్రీతి వాళ్ల నాన్న చూస్తే మమ్మల్ని చీప్ గా చూడొద్దంటూ అనే సీన్…ప్రతి సీన్లో వాళ్లు ఎన్ని సార్లు ముద్దు పెట్టుకున్నారు,ఎలా పెట్టుకున్నారు అనే చూసారు తప్ప,అందులోనే తప్పులు వెతికారు తప్ప…
అక్కడ వాళ్ల రిలేషన్ ఎంత బలంగా ఉంది అని ప్రేమని చూడలేకపోయారు… ముఖ్యంగా డైరెక్షన్ అదుర్స్… క్యారెక్టర్స్ ని పరిచయం చేయడం ఇంకా ఇంకా బాగున్నాయి..అచ్చంగా మన చుట్టూ జరుగుతున్న ఫీల్…
.
..హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి అర్జున్ రెడ్డి అని టైటిల్ పెట్టారు వాస్తవానికి పెళ్లిచూపులు టైప్ లో సోల్ మేట్ లాంటి టైటిల్ ఈ మూవీకి కరెక్ట్గా సరిపోయేది..
.
.
వాడి ఆటిట్యూడ్ ని,వాడి బూతులను చూడకుండా వాళ్ల ప్రేమని చూస్తేనే అర్దం అయ్యే సినిమా…మనసుతో చూస్తేనే అర్దం అయ్యే సినిమా…
చూడనివ్వండి సినిమాని చూస్తే అయినా కనీసం సెక్స్ అంటే బూతు కాదని తెలుసుకుంటారు…ప్రేమంటే ఏంటో తెలుసుకుంటారు..

రాజకుమారి కె..

 

 

Comments

comments

Share this post

scroll to top