మహిళపై థర్డ్ డిగ్రీ ? సున్నిత భాగాలలోకి లాఠీని గుచ్చారు ?

విలువైన అభరణాలు చోరీ చేసిందని ఆసీఫ్ నగర్ పోలీసులు  పద్మ అనే  మహిళను విచారించారు. విచారణ సమయంలో పద్మ కుప్పకూలిందని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆమె అక్కడే మృతి చెందింది. మహిళా లో లాకప్ డెత్ అంటూ టివీలలో , పేపర్లలో కథనాలు కూడా వచ్చాయ్. కానీ నవతెలంగాణ పేపర్ మాత్రం విస్మయానికి గురిచేసే విషయాలు బయటపెట్టింది.

 

third degree

 

విచారణ పేరుతో మహిళను చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూనే.. ఆమె సున్నితభాగంలోకి లాఠీ ని గుచ్చటం వల్లే ఆమె శరీరంలోని భాగాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. పద్మ కొనఊపిరితో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్మూలంలో తనను ఎలా చిత్ర హింసలకు గురిచేశారో పూసగుచ్చినట్టు తెలిపింది. అయినా సాయంత్రం 6 గంటల తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్లో ఉంచరాదన్న విషయం వీరికి తెలియదా ? ఇదే విషయమై   సిఐతో సహా ఆరుగురిని సస్పెండ్ చేశారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top