నిత్యం రక్తిసిక్తం.. ఏ ఉగ్రవాది ఎక్కడ దాక్కున్నాడో తెలియని ప్రాంతం. బాంబుల మోత కామన్. వీటన్నింటి మీద విసిగి వేసారిన ఓ పాక్ మహిళ…. తన బాధను, గుండెలోతుల్లోనుండి ఉబికి వస్తున్న ఆక్రోశాన్ని… తాను కాంక్షించిన స్వాతంత్రాన్ని గురించి ఇలా చెప్పింది. ఇది చూశాక ఇవి కేవలం ఆ ఒక్క దేశానికి సంబంధించిన ప్రశ్నలకు కావని నాకనిపిస్తోంది.
ఆగస్టు 14 ను ఎలా జరుపుకుంటారు అని ప్రశ్నించిన జర్నలిస్ట్ కు పాక్ మహిళ చెప్పిన సమాధానం.. గుండెల్ని పిండేసింది..అసలు స్వాతంత్ర్య వేడుకలు ఎందుకు చేయాలి – చుట్టూ కష్టాలతో కన్నీళ్ళతో చస్తూ ఉంటే… మనుషులు శవాల కుప్పలై పోతూ ఉంటే పండగ చేసుకుందామా?
రోజూ ఎవరో ఒకరి ఇంట్లో చావు కేకలు వినిపిస్తూనే ఉంటాయ్. చెప్పండి హంగూ ఆర్భాటాలతో జై..జై అంటూ నినాదాలు చేసుకుంటూ తిరిగే వాళ్లకు…ఇంకా ఇక్కడ స్వాతంత్ర్యం రాలేదని.. ఆజాదీ వచ్చింది ఇక్కడ నుండి చచ్చినోళ్లకే కానీ ఇంకా ఇక్కడ బతికినోళ్లకు కాదని అంటూ రాజకీయ నాయకులను విమర్శిస్తూనే …చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆకలికి ఏడుస్తుంటే మనం మాత్రం అన్నం ఎలా తింటాం అని ఈ మాతృమూర్తి పేదల కోణాన్ని హృంద్యంగా చెప్పింది.
గుండెల్లోనుండి వచ్చిన మాటలను ఎడిటింగ్ లో తీసేయాలని ఉచిత సలహా ఇచ్చిన ఈ జర్నలిస్ట్ ను ఏమనాలి.? ఈ ప్రశ్నలు కేవలం ఒక్క ఆ దేశానికి సంబంధించినవే అనుకోవాలా? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో నే ఉన్నా… జైహింద్.