రైలు కింద పడింది…తెలివిగా వ్యవహరించింది…56 బోగీల రైలు తనమీది నుండి పోయిన ప్రాణాలు రక్షించుకుంది.

అదృష్టం బహుశా ఆమెదేనేమో. ఎంత అదృష్టమంటే ఇక ప్రాణాలు పోయాయి అనుకున్న ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెపై ఓ రైలు ప్రయాణించింది. అటువంటి సమయంలో మీరే ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. పశ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ ఒకవైపు నుండి మరోవైపు ఫ్లాట్ ఫాం దగ్గరికి పట్టాలపై నడుచుకుంటూ వెళుతోంది. అలా నడుస్తుండగా ఆమె కాలు స్లిప్ కావడంతో పట్టాలపైనే పడిపోయింది. ఇక అదే సమయంలో ఎదురుగా 56 బోగీల గూడ్స్ రైలు వస్తోంది. కాళ్ళు చేతులూ ఆడలేదు. అక్కడే ప్రయాణికులు, రైల్వే అధికారులు ఆమె పడిపోవడం చూశారు కానీ ఏమీ చేయలేకపోయారు. అయితే టెన్షన్ గా పడుతున్న ఆమె పరిస్థితిని గమనించిన అధికారులు, వెంటనే ఆమెను బోర్లా పడుకోమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆమె చేసింది. ఇక ఆ రైలు  వెళ్ళేంతవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవుడా అనుకుంది. అలా రైలు వెళ్ళగానే ఆమెను పట్టాలనుండి బయటకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అలా రైలు కింద నుండి పడిపోయి ప్రాణాలు దక్కించుకుంది. అదృష్టం అంటే అదేకదా.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top