మ‌హిళామ‌ణులు – స్ఫూర్తి శిఖ‌రాలు

ఏదీ సుల‌భంగా ల‌భించ‌దు. అపార‌మైన వ‌న‌రులు..అంతులేని అవ‌కాశాలు ఎన్నో వుండొచ్చు. వాటిని అందిపుచ్చు కోవాలంటే కొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే. అన్నీ వుంటే విజ‌యం దానంత‌ట అదే ద‌క్కుతుంది. కానీ అల‌వోక‌గా సాధిస్తే అందులో మ‌జా ఏముంటుంది. కాలం మారింది..పురుషుల‌తో ధీటుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. ప్ర‌తి రంగంలో త‌మ‌దైన అనుభ‌వాల‌ను ..విజ‌యాలుగా మారుస్తున్నారు. అలాంటి వారిలో ఇండియాకు చెందిన మ‌హిళామ‌ణులు ల‌క్షలాది మందికి స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. వారెవ‌రో తెలుసు కోవాలంటే..ఈ క‌థ చ‌ద‌వాల్సిందే. మీరేం చేసినా ఓకే..కానీ భిన్నంగా చేయాలి. ఈ విష‌యం నేను మా అమ్మ గారి నుండి నేర్చుకున్నా. ఒక ఆంట్ర‌ప్రెన్యూర్‌గా ఇంత‌కంటే గొప్ప‌గా ఎవ‌రు చెబుతారు. దీని మీదే నేను నిల‌బ‌డి ఉన్నానని అంటోంది ..బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా వినుతి కెక్కిన అనితా రాడ్డిక్ ఓ సంద‌ర్భంలో. ఐటీ, హెల్త్, లాజిస్టిక్, టెలికాం, త‌దిత‌ర రంగాల‌లో త‌మ‌దైన ముద్ర ఉండేలా క‌ష్ట‌ప‌డుతున్నారు.

అర్పితా గ‌ణేష్ పేరు విన్నారా. ఇండియ‌న్ బ్రా లేడీగా ప్ర‌సిద్ధి చెందింది ఇండియాలో. బాలిక‌లు, మ‌హిళ‌లు లో దుస్తులు ధ‌రించాలంటే ఎంతో ఇబ్బంది ప‌డ‌తారు. ముఖ్యంగా నెల నెలా వ‌చ్చే పీరియ‌డ్స్ విష‌యంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రికీ చెప్పుకోలేక నానా రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. త‌క్కువ ధ‌ర‌కు, పూర్తి ప‌ర్యావ‌ర‌ణానికి అనుగుణంగా ఉండేలా వీటిని త‌యారు చేశారు. ఆమెకు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ రంగంలో ప‌దేళ్ల అనుభ‌వం ఉన్న‌ది. మ‌హిళ‌ల‌కు సులువుగా ఉండేలా 2008లో బ‌ట్ట‌ర్ క‌ప్స్ రూపొందించారు. 3000 మంది వీటిని స‌క్సెస్‌ఫుల్‌గా వాడారు. ఉమెన్స్ నుండి డిమాండ్ పెర‌గ‌డంతో పెట్టుబడులు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డ్డాయి. రాశి మేంద‌ర్షి ..జాప్లే పేరుతో స్టార్ట్ చేసిన స్టార్ట‌ప్ డాల‌ర్ల‌ను కురిపిస్తోంది. మెల్ల‌న్ యూనివ‌ర్శిటీలో 2009లో మ‌నిషా బిగ్ డేటా..అన‌లిటిక్స్ లో చ‌దివారు. లాజిస్టిక్‌లో అనుభ‌వం గ‌డించారు. ఐబీఎం కంపెనీలో క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేశారు.

రోడ్ల‌పై భారీ బ‌రువుల‌తో ప‌రుగులు తీసే వెహిక‌ల్స్ ఎక్క‌డ వెళుతున్నాయో తెలుసు కోవాలంటే చాలా ఇబ్బంది. దీనిని గ‌మ‌నించిన ఓరియ‌న్. ఆమె క‌నుగొన్న యుపీఎస్ టెక్నాల‌జీని 60 కంపెనీలు వాడుతున్నాయి. అందులో ఫ్లిప్ కార్డ్, పేటిం కూడా. 10 మిలియ‌న్ డాల‌ర్ల ఫండ్ కూడా చేరింది. ప్రియాంక గిల్, న‌మ్ర‌తా బాస్ట్రోం లు ఇవాళ డిజిట‌ల్ రంగంలో పేరున్న వాళ్లు. వీళ్లు ఇండియ‌న్స్. డిజిట‌ల్ లైఫ్ స్ట‌యిల్ మేగ‌జైన్ ను తీసుకు వ‌చ్చారు. పాప్‌క్సో కంపెనీకి కో ఫౌండ‌ర్స్. న‌య్యా స‌గ్గి ..ఈ పేరు ఎవ‌రైనా గుర్తు ప‌డ‌తారు. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబిఏ చేశారు. ఫుల్ బ్రైట్..జెఎన్ టాటా స్కాల‌ర్ కూడా. బేబి చ‌క్ర పేరుతో మెట‌ర్నిటీ..చైల్డ్ కేర్ కోసం స్టార్ట్ చేశారు. ఇపుడు కోట్లు కురిపిస్తోంది. ముంబై, బెంగ‌ళూరు, డిల్లీకి విస్త‌రించింది.

చికాగో యూనివ‌ర్శిటీలో ఆదితీ అవ‌స్థి ఎంబీఏ చేశారు. స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఎలా ప్రిపేర్ కావాలో..ఏమేం ఉంటాయో ఉండేలా స్టార్ట‌ప్ స్టార్ట్ చేసింది. ఎంబైబ్ పేరుతో జేఇఇ మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ల‌కు ఇది క‌ల్ప‌త‌రువుగా మారింది. ఎక్క‌డ‌లేని డిమాండ్ పెర‌గ‌డంతో ..నిధులు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డ్డాయి. వాణి కోలా. ఈపేరు చెబితే దేశంలో ఎక్క‌డికి వెళ్లినా స్టార్ట‌ప్‌, ఆంట్ర‌ప్రెన్యూర్ రంగంలో ఇట్టే గుర్తు ప‌డ‌తారు. అంత‌గా పాపుల‌ర్ ఆమె. వెంచ‌ర్ కేపిట‌లిస్ట్‌గా ..క‌లారి కేపిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఆమె స్వ‌స్థ‌లం హైద‌రాబాద్. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివారు. ఆరిజోనా స్టేట్ యూనివ‌ర్శిటీలో ఎంఏ చేశారు. 22 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఇప్ప‌టికీ రెండు కంపెనీలు స్థాపించి అమ్మేశారు. సిలికాన్ వాలీ కేంద్రంగా ప‌నిచేస్తున్నారు. సుచి పాండ్యా స‌క్సెస్ ఫుల్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా పేరొందారు. పిపా బెల్లా స్టార్ట‌ప్ స్టార్ట్ చేశారు.

టెక్ బేస్డ్ బిజినెస్ ఇది. ఢిల్లీ కేంద్రంగా సుచిత్ర స్టార్ట్ చేసిన లిటిల్ బుక్ డిల్లీ భారీగా నిధుల‌ను రాబ‌ట్టింది. ల‌క్షా 50 వేల డాల‌ర్లు పోగ‌య్యాయి. శ్ర‌ద్ధా శ‌ర్మ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేశారు. బ్రాండ్ అడ్వ‌యిజ‌ర్‌గా ఉన్నారు. టీవీ 18 కు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. యువ‌ర్ స్టోరీ, హ‌ర్ స్టోరీ, సోష‌ల్ స్టోరీ, వైఎస్ టీవీ, వైఎస్ రిసెర్చ్, వైఎస్ పేజెస్ 60 మిలియ‌న్ల‌కు చేరుకుంది. 220 ఈవెంట్స్ నిర్వ‌హించింది..వైఎస్ మీట‌ప్స్ ద్వారా. టెక్ స్పార్క్స్, మొబైల్ స్పార్క్స్, షి స్పార్క్స్ కూడా ఆమెకు చెందిన‌వే. మోహ‌న్ దాస్ పై, ర‌త‌న్ టాటా ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టారు. నిధి అగ‌ర్వాల్..ఉమెన్స్ కోసం త‌యారు చేసిన దుస్తుల కంపెనీ కోట్లు కురిపిస్తోంది. అదే కార్యాహ్. ఇందులో టాటా ఇన్వెస్ట్ చేశారు.

మ‌ద్రాస్ యూనివ‌ర్శిటీలో ఎంబీఏ, ఐఐఎం కోల్‌క‌తాలో చ‌దివారు. ఎన్ ఐఐటీ లో చ‌దివారు మీనా గ‌ణేష్‌. హెల్త్ రంగంలోకి ప్ర‌వేశించారు. ఇంటి ద‌గ్గ‌ర‌కే ఆరోగ్య సేవ‌లు అందించేందుకు పోర్టియా మెడిక‌ల్ కంపెనీ స్థాపించారు. డాల‌ర్లు కురిశాయి. 24 న‌గ‌రాల‌కు విస్త‌రించింది. 60 వేల మంది సేవ‌లందిస్తున్నారు. 37.5 వేల డాల‌ర్ల నిధులు వ‌చ్చాయి. జెట్ సెట్ గో స్టార్ట‌ప్ ప్రారంభంలోనే స‌క్సెస్ గా నిలిచింది. ప్రైవేట్ ఏవియేష‌న్ బిజినెస్ ఇది. లావ‌న్య గోపాల్, నిధి వ‌ర్మ‌, సోల్ ప్రిమోరో పేరుతో స్వేతా సింగ్, ప్రేషా జొమాటో స్టార్ట్ చేశారు. యువ‌ర్ దోస్త్ స్టార్ట‌ప్‌ను రిచా సింగ్ స్టార్ట్ చేశారు. ఇది త‌క్కువ టైంలో పాపుల‌ర్ అయ్యింది. 70 వేల మంది యూజ‌ర్స్ ఉన్నారు. 10 వేల మంది రిజిష్ట‌ర్ అయ్యారు. 40 శాతం చొప్పున పెరుగుతోంది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు.

2009లో మైదాలా పేరుతో చిన్న కంపెనీని ప్రారంభించారు అనిషా సింగ్. ఇది కూడా పాపుల‌ర్ అయ్యింది. నిధులు కొల్ల‌గొట్టింది. స్వాతి బార్గ‌వ, రిచా క‌ర్ జివామె కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రియా మ‌హేశ్వ‌రి ప్రోపెర్జీని స్టార్ట్ చేసింది. ఇది కూడా మంచి ఆదాయాన్ని గ‌డిస్తోంది. రాధికా ఘై, రాధికా అగ‌ర్వాల్ లు ప్రారంభించిన షాప్‌క్లూస్ కంపెనీ కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక ఫాల్గుణి న‌య్య‌ర్ ..స్టార్ చేసిన కంపెనీ కూడా నిధులు కొల్ల‌గొడుతోంది. ప్రాంషు భండారి, సైరీ చాహ‌ల్, సాక్షి బాసిన్, సాక్షి తుల్సియాన్, సుచి ముఖ‌ర్జీ, ఆదితి గుప్త మ‌హిళ‌ల కోసం మెన్‌స్ట్రూపిడియా పేరుతో ప్రారంభించిన కంపెనీ మ‌హిళ‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటోంది. నిధులు రాబ‌ట్టింది. మొబిక్విక్ ను ఉపాస‌న టాకు ప్రారంభించారు. ఇది కూడా కోట్లు కొల్ల‌గొడుతోంది.

Comments

comments

Share this post

scroll to top