ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, డబ్బుల కోసం వేధించాడు, చివరికి ఆత్మహత్య చేసుకుంది..!

ప్రేమ పెళ్లిళ్లకు పెద్ద వాళ్ళు అడ్డు పడటానికి గౌరవం, మర్యాద అనే పదాలు అడ్డు రావడం వలనే అని అందరూ అనుకుంటారు, కానీ చాలా మంది గౌరవం, మర్యాదలకన్నా పిల్లోల్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొనే వద్దని అంటారు. తల్లి తండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఒక వివాహిత. వివరాల్లోకెళితే…

ఇద్దరి కులాలు వేరు, అయినా వారి ప్రేమకు కులం అడ్డు రాలేదు, కాలేజీ లో చదువుతున్నప్పటి నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య బంధం మరింత బలపడింది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పించాడు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో మొదట పెళ్ళికి ఒప్పుకోలేదు, కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్లే ఒప్పించారు, ఇరువురు తల్లితండ్రుల అంగీకారంతోనే పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కానీ పెళ్లి అయి సంవత్సరం తిరగకుండానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.

డబ్బులే కారణం.. :

మృతురాలు ప్రియాంక తల్లి రోజారమణి మీడియా తో మాట్లాడారు, వారు తెలిపిన వివరాల ప్రకారం. ప్రియాంక (23) ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నవీన్‌ను ప్రేమించింది. తొలుత తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ఆ తర్వాత కూతురి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు. నవీన్‌ మార్టూరులో గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని నెలల నుండి నుంచి నవీన్, ప్రియాంకల మధ్య ఆర్థిక వివాదాలు నడిచాయి.

ప్రియాంక తల్లితండ్రులు గుంటూరులో నివాసముంటారు, గుంటూరు కి వెళ్లి తల్లిదండ్రుల నుంచి మరికొంత నగదు తీసుకు రావాలని నవీన్‌ తన భార్య ప్రియాంకను చిత్రహింసలకు గురిచేసేవాడు. పెళ్లయిన సంవత్సరం వ్యవధిలోనే పలు విడతలు డబ్బులు సర్దుబాటు చేసారు. ఈ నేపథ్యంలో గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ప్రియాంకకు తల్లి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. అనుమానం వచ్చి మార్టూరు రాగా ప్రియాంక సీలింగ్‌కు ఉరేసుకుని తల్లికి కనపించింది. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున ప్రియాంక మృతి చెందింది. తమ కుమార్తెను భర్త నవీన్, అత్త, మామ హింసించి, వేధించి హత్య చేశారని ప్రియాంక తల్లిదండ్రులు బాధపడుతూ ఆరోపిస్తున్నారు.

డబ్బులు తేలేక ఆత్మహత్య చేసుకుందా.. లేక.?

డబ్బులు సర్దుబాటు చెయ్యలేక ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేసి ఆత్మహత్య కింద చిత్రీకరించారా అని ప్రశ్నలు వెంటాడుతున్నాయి, పోలీసులు విచారణ మొదలెట్టారు, విచారణ తరువాత అసలు విషయాలు బయటపడతాయి, నిందితులకు శిక్ష తప్పకుండ పడుతుందని ప్రియాంక బంధువులు చెబుతున్నారు.

ప్రేమించి, ఒప్పించి ఇష్టపూర్వకంగా సంతోషంగా పెళ్లి చేసుకొని అయిష్టంగానే లోకాన్ని వీడిపోవాల్సి వచ్చింది, ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా కొందరు తల్లితండ్రుల కులం, మతం, గౌరవం కంటే కేవలం పిల్లోల్ల భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని ప్రేమ పెళ్లిళ్లకు విరుద్ధంగా ఉంటారని అనిపిస్తుంది.

 

Comments

comments

Share this post

scroll to top