పనిలో మగాళ్ళు, మహిళలకు సరితూగాలంటే ……ఇంకా 170 యేళ్లు పడుతుందంట!

ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం అన్నారు పెద్ద‌లు. కానీ అది ఒక‌ప్ప‌టి మాట‌. నేడు మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు, ఆ మాట కొస్తే కొంచెం ఎక్కువగానే వారు క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌మ కుటుంబం కోసం శ్ర‌మిస్తున్నారు. ఇది మేం చెబుతున్న మాట కాదు. వ‌ర‌ల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా చేసిన స‌ర్వే ఆధారంగా చెబుతున్న నిజం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో పురుషుల క‌న్నా మ‌హిళ‌లే ఎక్కువ‌గా ప‌నిచేస్తున్నార‌ట‌. మ‌న దేశంలో ఆ శాతం ఇంకా ఎక్కువ‌గానే ఉంద‌ని స‌ద‌రు సంస్థ చేసిన స‌ర్వేలో వెల్ల‌డైంది.

working-women

వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం (డ‌బ్ల్యూఈఎఫ్‌)కు చెందిన గ్లోబ‌ల్ జెండ‌ర్ గ్యాప్ (ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న లింగ తార‌త‌మ్యాలు) నివేదిక పైన చెప్పిన విష‌యాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న పురుషులు, మ‌హిళ‌ల ప‌నిగంట‌ల‌ను లెక్క తీసుకుని చూడ‌గా తెలిసిందేమిటంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల క‌న్నా మ‌హిళ‌లే ఏడాదికి 39 రోజులు ఎక్కువగా ప‌నిచేస్తున్నార‌ట‌. ఇది మ‌న దేశంలో 50 రోజులుగా ఉంద‌ని తెలిసింది. అంటే మ‌న ద‌గ్గ‌ర ఓ పురుషుడి క‌న్నా స్త్రీ ఏడాదికి 50 రోజులు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంద‌ట‌.

సాధార‌ణంగా ఎవ‌రు ప‌నిచేసినా అది ఏదైనా ఓ కంపెనీకో, సంస్థ‌కో చేస్తే దాన్ని పెయిడ్ వ‌ర్క్ కింద ప‌రిగ‌ణిస్తారు. కానీ అది దాదాపుగా పురుషులే చేస్తారు. మ‌హిళ‌ల్లో పెయిడ్ వ‌ర్క్ ఉద్యోగులు త‌క్కువే. అయితే మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఇంటి ప‌ని చేస్తారు క‌దా. దీనికి వారికి ఎలాంటి డ‌బ్బు రాదు. దాన్ని అన్‌పెయిడ్ వ‌ర్క్ అని అంటారు. అంటే ఈ అన్‌పెయిడ్ వ‌ర్క్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే పురుషుల క‌న్నా మ‌హిళలే ఎక్కువ రోజులు ప‌నిచేస్తున్న‌ట్టు లెక్క‌. స‌రిగ్గా ఇదే ప‌ద్ధ‌తిలో గ్లోబ‌ల్ జెండ‌ర్ గ్యాప్ స‌ర్వే చేసింది. దీంతో పైన చెప్పిన విష‌యాలు తెలిశాయి. అయితే ఈ ప‌నిరోజుల తార‌త‌మ్యం పోవాలంటే ఇంకా మ‌రో 170 ఏళ్లు ప‌డుతుంద‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు ఈ అస‌మాన‌త ఇలాగే ఉంటుంద‌ని స‌ద‌రు సంస్థ చెబుతోంది. ఏది ఏమైనా అన్‌పెయిడ్ వ‌ర్క్ చేసే మ‌హిళ‌లు త‌మ త‌మ కుటుంబాల కోసం చేస్తున్న త్యాగం, శ్ర‌మ మ‌రిచిపోలేనిది. వారికి ఎన్ని రివార్డులు ఇచ్చినా అవి త‌క్కువే అవుతాయి. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top