జైలులో ఉన్న ప్రియున్ని త‌ప్పించేందుకు ఆ ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?

ప్రేమంటే అంతే… ప్రేయ‌సీ ప్రియుల చేత ఏదైనా చేయిస్తుంది. ఎంత‌టి ప‌ని చేసేందుకైనా పురికొల్పుతుంది. అది అపాయ‌మైనా స‌రే, సులువుదైనా స‌రే… ప్రేయ‌సి లేదా ప్రియుడు ఆప‌ద‌లో ఉన్నారంటే చాలు తమ పార్ట్‌న‌ర్ కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడ‌రు. ఎంత‌టి సాహ‌సానికైనా తెగిస్తారు. వెనిజులాలో స‌రిగ్గా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రియున్ని క‌లిసే నెపంతో ఓ ప్రియురాలు వెళ్లింది, అక్క‌డి నుంచి అత‌న్ని త‌ప్పించాల‌ని చూసింది, అది కుద‌ర‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు చిక్కి తాను కూడా జైలు ఊచ‌లు లెక్క‌పెడుతోంది. ఈ మ‌ధ్యే జ‌రిగిన ఈ సంఘ‌టన ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

women-boyfriend-jail
ఆమె పేరు ఆంటోనియెటా రోబుల్స్ సౌదా. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. ఆమెకు 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల ఓ కూతురు కూడా ఉంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ జోస్ వ‌ర్గాస్ గార్షియాకు ఓ నేరంలో శిక్ష ప‌డ‌డంతో వెనిజులాలో అక్క‌డి పోలీసులు జైలులో పెట్టారు. ఈ క్ర‌మంలో శిక్ష అనుభ‌విస్తున్న జోస్ ను క‌లిసేందుకు సౌదా వెనిజులా జైలుకు వ‌చ్చింది. త‌న‌తోపాటు త‌న కూతుర్ని కూడా అక్క‌డికి తీసుకువ‌చ్చింది. అయితే సౌదా నిజంగా అత‌న్ని క‌లిసేందుకు అక్క‌డికి వెళ్ల‌లేదు. ఎలాగైనా త‌న బాయ్‌ఫ్రెండ్ జోస్‌ను జైలు నుంచి త‌ప్పించాల‌ని డిసైడై అక్క‌డికి చేరుకుంది.

ఈ క్రమంలో త‌న‌తోపాటు సౌదా ఓ పెద్ద సూట్‌కేసును కూడా జైలుకు తీసుకువెళ్లింది. అందులో త‌న బాయ్ ఫ్రెండ్ జోస్ ను కూర్చోపెట్టి దాని ద్వారా అత‌న్ని త‌ప్పించాల‌ని ఆమె ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలో ఆమె జైలులోకి వెళ్లేట‌ప్పుడు ఆ సూట్‌కేస్‌ను అల‌వోక‌గా తీసుకెళ్లింది. ఎందుకంటే అది ఖాళీగా ఉంటుంది క‌దా. అనంత‌రం ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌ను జైలులో క‌లిశాక అతన్ని అందులో పెట్టి లాక్ చేసి జైలు నుంచి బ‌య‌ట‌కు తెస్తోంది. అయితే అలా తెచ్చే క్ర‌మంలో జైలులో ఉండే పోలీసులు ఓ విష‌యం గ‌మనించారు. సూట్‌కేస్ తెచ్చిన‌ప్పుడు దాన్ని చాలా ఈజీగా మోసుకెళ్లింది. తీరా బ‌య‌టికి వ‌స్తుంటే మాత్రం ఆమె దాన్ని మోయ‌లేక‌పోతోంది, ఎందుకు, అని ఆ పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. ఇంకేముంది, వారు ఆ సూట్‌కేసును తెర‌చి చూడ‌గా అందులో జోస్ న‌క్కి ఉండ‌డం క‌నిపించింది. దీంతో వెంట‌నే వారు జోస్ తోపాటు అత‌న్ని త‌ప్పించేందుకు య‌త్నించిన అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ సౌదాను కూడా అదుపులోకి తీసుకుని ఇద్ద‌రినీ జైళ్లో వేశారు. సౌదా కూతుర్ని స్థానికంగా ఉన్న ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌కు సంర‌క్ష‌ణ నిమిత్తం అప్ప‌గించారు. చూశారుగా..! ప్రేమికులు ఎంత‌టి సాహసం చేయ‌డానికైనా వెనుకాడ‌రనే దానికి ఇదొక ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ‌..!

Comments

comments

Share this post

scroll to top