మణికొండ నుంచి జూబ్లీహిల్స్‌కు క్యాబ్ బుక్‌ చేసింది.! డ్రైవర్ టచ్ చేయాలని చూస్తే. ఆమె తెలివిగా ఏం చేసిందంటే.?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా.. సాధారణంగా మన దేశంలో పోలీసులు ఎవరైనా ఇట్టే ప్రవర్తిస్తారు. ఏదదైనా సంఘటన లేదా నేరం జరిగేందుకు ముందు లేదా జరిగిన సమయంలో, జరిగాక కొంత సేపటికి గాని స్పందించరు. పుణ్య కాలం కాస్తా పూర్తయ్యాక ఎప్పుడో తీరిగ్గా వచ్చి.. ఆ.. ఏం జరిగింది.. ఎలా జరిగింది.. అంటూ వివరాలను సేకరించే పనిలో పడతారు. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఏ కోశానా ఉండదు. అయితే.. హైదరాబాద్‌ నగర పోలీసులు మాత్రం అలా కాదు. చాలా వేగంగానే స్పందించారు. తనకు ఆపద ఉందని ఓ మహిళ వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే వారు అప్పటికప్పుడు స్పందించి వెంటనే నిందితున్న పట్టుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌ నగరంలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఓ మహిళ మణికొండ నుంచి జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10కు వెళ్లేందుకు ఊబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసింది. ఈ క్రమంలో మార్గ మధ్యలోకి రాగానే సదరు క్యాబ్‌ డ్రైవర్‌ ఆమె కాళ్లను టచ్‌ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆపద శంకించిన ఆమె 9490616555 అనే వాట్సాప్‌ నంబర్‌కు తాను ఎదుర్కొంటున్న సమస్యను తెలియజేసింది.

అలా ఆ మహిళ తన సమస్యను మెసేజ్‌ చేసే సరికి జూబ్లీ హిల్స్‌ పోలీసులు వెంటనే స్పందించారు. ఆమె లొకేషన్‌ను ట్రాక్‌ చేశారు. ఆమె గమ్యస్థానంలో దిగే సరికి అక్కడే పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది కాపు కాశారు. ఈ క్రమంలో ఆమె కారు దిగగానే వెంటనే గుర్తు పట్టి ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇందుకు గాను ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. నిజంగా పోలీసులు అందరూ ఇలా చేస్తే అప్పుడు ప్రతి బాధితురాలికి సత్వరమే న్యాయం జరుగుతుంది కదా..!

Posted by Hyderabad City Police on Thursday, 15 February 2018

Comments

comments

Share this post

scroll to top