పెంపుడు కొండచిలువ..ఎంత ప్లాన్ వేసెరా? అమ్మాయి ఆగమయిపోయేది.!?

కుక్క‌లు, పిల్లులు, పిట్ట‌లు… ఇలా జంతువులు, ప‌క్షుల‌ను పెంచుకోవ‌డం మ‌న‌కు ఎప్ప‌టి నుంచో అల‌వాటు. మ‌నం ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నా అవి మ‌న‌తో మాత్రం విశ్వాసంగానే ఉంటాయి. మ‌న‌కు తోడుగానే ఉంటాయి. వాటి స్వ‌భావం ఎప్ప‌టికీ మార‌దు. ఇలా అనుకునే ఓ మ‌హిళ ఏకంగా ఓ కొండ‌చిలువ‌ను స‌ర‌దాగా పెంచుకుంది. అయితే అది పైన చెప్పిన‌ట్టుగా విశ్వాసంగా ఉండే కుక్కో, పిల్లో కాదుగా. పాము మ‌రి. త‌న స్వ‌భావాన్ని చివ‌ర‌కు ఆ మ‌హిళ తెలుసుకునేలా చేసింది. దీంతో అస‌లు విష‌యం తెలిసిన ఆ మ‌హిళ ఒక్క‌సారిగా భ‌యానికి లోనై త‌న పెంపుడు చిలువ‌ను దూరం పెట్టేసింది. అస‌లు జ‌రిగిందేమిటంటే…

woman-and-python

ఓ మ‌హిళ 4 మీట‌ర్ల (దాదాపు 13 అడుగులు) పొడ‌వైన కొండ చిలువ పామును ఇంటికి తెచ్చుకుని పెంపుడు జంతువులా స‌ర‌దాగా పెంచుకుంటోంది. దానికి కావ‌ల్సిన ఆహారాన్ని నిత్యం ఆమె అందించేది. కాగా ఆ మ‌హిళ బెడ్‌పై నిత్యం న‌గ్నంగా నిద్రించ‌డ‌మే కాకుండా త‌న‌తోపాటు కొండ చిలువ‌ను కూడా పడుకోబెట్టుకునేది. ఆ క్ర‌మంలో కొండ చిలువ ఆ మ‌హిళ‌ను చుట్టుకుని ప‌డుకునేది. ఇదిలా ఉండ‌గా ఒక రోజు ఆ కొండ చిలువ స‌డెన్‌గా తిండి తిన‌డం మానేసింది. అలా 2, 3 రోజులు అదే సీన్ కంటిన్యూ అయింది. ఆ మ‌హిళ ఏం పెట్టినా కొండ చిలువ తిన‌లేదు. కానీ రాత్రి పూట మాత్రం త‌న‌ను చుట్టుకుని బాగానే ప‌డుకునేది. దీంతో ఆ కొండ చిలువ‌ను ద‌గ్గ‌ర్లో ఉన్న వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి ఆమె తీసుకువెళ్లింది. అక్క‌డే ఆ మ‌హిళ‌కు షాక్ లాంటి నిజం తెలిసింది.

woman-and-python

కొండ చిలువను అన్ని ర‌కాలుగా ప‌రీక్షించిన ఆ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ఆ మ‌హిళ‌ను సూటిగా ఓ ప్ర‌శ్న అడిగింది. అదేమిటంటే రాత్రి పూట ఆ పాము మ‌హిళ‌ను పూర్తిగా చుట్టుకుని ప‌డుకుంటుందా, లేదా అని. దీనికి ఆ మహిళ అవుననే స‌మాధానం చెప్పింది. ఇంకేముంది ఆ డాక్ట‌ర్ ఊహించింది క‌రెక్టే అయింది. తాను అనుకున్న‌ది మ‌హిళ‌కు చెప్పేసింది. ఆ కొండ చిలువకు తిండి తిన‌డంలో ఎలాంటి స‌మ‌స్య లేద‌ట‌. కానీ రోజూ పెట్టే తిండే న‌చ్చక ఏకంగా త‌న‌ను పెంచుకుంటున్న మ‌హిళ‌నే గుటుక్కున మింగేయాల‌ని ప్లాన్ వేసింది. అందుకే అది తిండి తిన‌కుండా రోజూ రాత్రి ఆ మ‌హిళ‌ను పూర్తిగా చుట్టుకోవ‌డం ప్రారంభించింది. అలా చుట్టుకునే క్ర‌మంలో ఆ మ‌హిళ ఎంత సైజ్ ఉంది, ఎంత సేప‌ట్లో తాను ఆమెను మింగ గ‌ల‌దు వంటి అంచ‌నాల‌ను ఆ పాము వేయ‌డం ప్రారంభించింది. ఇంకా కొద్ది రోజులు అలాగే ఉంటే ఆ పాము ఆమెను నిజంగానే మింగేసేద‌ట‌. అయితే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు పామును తీసుకురావ‌డంతో అస‌లు విష‌యం ఆ మ‌హిళ‌కు తెలిసింది. డాక్ట‌ర్ చెప్పిన విష‌యాన్నంతా విన్న ఆ మ‌హిళ ఒక్క‌సారిగా ఊహించ‌ని షాక్‌కు గురైంది. దీంతో ఆ చిలువ‌ను వెంట‌నే దూరం పెట్టేసింది. ఇప్ప‌టికైనా తెలిసిందా అన్ని జంతువులు కుక్క‌లా విశ్వాసం క‌ల‌వి కాలేవ‌ని. ఆ మ‌హిళ‌కైతే తెలిసే ఉంటుంది లే. ఇక జీవితంలో పాముల జోలికి వెళ్ల‌దు. తానేమో త‌న పెంపుడు చిలువ‌కు ఏదో అయింద‌ని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్తే అక్క‌డ దిమ్మ తిరిగే విష‌యం ఆ మ‌హిళ‌కు తెలిసింది. ఈ సంఘ‌ట‌న‌తోనైనా పెంపుడు జంతువులను పెంచుకునే వారు ఓ కంట వాటి స్వ‌భావాన్ని క‌ని పెట్టి ఉండ‌డం మంచిది. లేదంటే పైన చెప్పింది చూశారుగా, అలాంటి ప‌రిణామాలే ఎదుర‌వుతాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top