ఆస్తికోసం.. భర్తను చంపాలనుకుంది కానీ చివరకు ఏమైందో చూడండి.??

ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు చూసాం… తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా చూసాం… ఆస్తి కోసం కన్నవారిని కూడా పొట్టన పెట్టుకున్న కసాయి వాళ్లను చూసాం… కానీ ఆస్తి కోసం భర్తను కడతేర్చాలని చూసిందో భార్య.. భర్త పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద, పిల్లల పేరు మీద రాయాలి అంటూ గత కొన్ని రోజులుగా భర్తతో ప్రతి రోజు గొడవ పడుతూ ఉండేది. అందుకు భర్త ససేమిరా అనడంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. స్నానం చెయ్యడం కోసం స్టౌ మీద పెట్టుకున్న వేడి నీళ్లను భర్తపై పోసి ఆస్పత్రి పాలయ్యేలా చేసింది… విజయవాడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

For the property .. Woman sheds hot water on her husband .
విజయవాడ అయోధ్య నగర్ కు చెందిన అట్లూరి వెంకట రమణకు 18 ఏళ్ల క్రితం కొసరాజు హేమలతతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకటరమణ హైదరాబాద్ లో భవన నిర్మాణ పనులు చేయిస్తుంటారు. భార్య హేమలత హింది ఉపాధ్యాయురాలుకా పని చేస్తోంది. భార్య భర్తలు అన్నాకా తరచూ గొడవలు సహజం… కానీ వీరి మధ్య గొడవలు ఆస్తి తగాదాలుగా మారాయి. భర్త పేరిట ఉన్న ఆస్తిని తన పేరు మీద, పిల్లలు పేరు మీద రాయాలంటూ పదే పదే భర్తను కోరేది. కానీ భర్త పట్టించుకోకపోవడంతో భర్తపై కక్ష పెంచుకుంది.
ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం లేదంటూ తరచూ భర్తతో గొడవలు పడేది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు వెంకటరమణ నీళ్లు స్టౌ పై పెట్టుకున్నాడు. అవి కాగుతుండగానే భర్తపై కక్ష పెట్టుకున్న భార్య హేమలత ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకువచ్చి భర్త వీపు పై పోసింది. దీంతో వెంకటరమణ శరీరంపై చాలా చోట్ల బొబ్బలు తేలాయి. దీంతో తీవ్ర గాయాలైన వెంకటరమణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య హేమలత తనపై హత్యాయత్నం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు వెంకట రమణ…

 

Comments

comments

Share this post

scroll to top