మండుతున్న ఎండల్లో బండలపై ఆమ్లెట్ వేస్తున్న మహిళ… జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు…

కోడిగుడ్డుతో వేసిన ఆమ్లెట్ అంటే మీకు ఎంతో ఇష్ట‌మా..? అయితే ఇంకెందుకాల‌స్యం… వెంటనే అందుకు కావ‌ల్సిన స‌రంజామా అంతా సిద్ధం చేసుకుని ఆమ్లెట్ వేసుకుందామా..? ఆ..! ఆగండి, ఆగండి. అక్క‌డే ఆగిపోండి! ఎందుకంటారా! మీరు ఆమ్లెట్ వేయాల‌నుకుంటే కిచెన్ దాకా వెళ్లి, స్ట‌వ్ వెలిగించి, ప్యాన్ పెట్టి, దాన్ని హీట్ చేసి ఆమ్లెట్ వేయాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ఎంచ‌క్కా బ‌య‌టికి వెళ్లి నున్న‌ని నాప‌రాయి బండ‌ల‌పై కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని అట్టులా వేస్తే చాలు. క్ష‌ణాల్లోనే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఏంటి న‌మ్మ‌లేక‌పోతున్నారా? ఇది నిజంగా నిజ‌మేనండీ బాబూ!

omelette-on-floor

వేస‌వి కాలం పుణ్య‌మా అని ఇంకా మే కూడా రాక‌ముందే ఎండ‌లు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గ‌త రెండు రోజులుగా భానుడు త‌న ఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు. ఈ క్ర‌మంలో ఎండ దెబ్బ కార‌ణంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 35 మంది దాకా మృతి చెందారు. ప‌గ‌టి పూట ఉష్ణోగ్ర‌త‌లైతే 40 డిగ్రీల‌కు కింద‌కు దిగ‌డం లేదు.

కాగా ఎండ తీవ్ర‌త‌ను తెలియ‌జేసేలా క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ త‌న ఇంటి ముందు ఉన్న బండ‌ల‌పై ఆమ్లెట్ వేసి చూపించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వినోదం కోసం కాకపోయినా ఈ వీడియో చూసైనా ఎండ‌లో బ‌య‌టికి వెళ్లాల‌నుకునే వారు జాగ్ర‌త్త‌లు పాటిస్తార‌ని మా చిన్నప్ర‌య‌త్నం. మ‌రో రెండు, మూడు రోజుల వ‌ర‌కు దాదాపు ఇవే ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లాల‌ని, లేదంటే ఆ ప‌ని మానుకోవాల‌ని వైద్యులు కూడా సూచిస్తున్నారు. సో బీకేర్‌ఫుల్ వెన్ యు గో ఔట్ సైడ్‌!

బండ‌రాళ్ల‌పై మ‌హిళ ఆమ్లెట్ వేస్తున్న వీడియోను ఇప్పుడు మీరూ చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

scroll to top