ఆమె ఓ నిండు గ‌ర్భిణీ. ఒంటిపై 20వేల తేనెటీగ‌ల‌తో ఫొటోషూట్ చేసింది. త‌రువాత ఏమైందో తెలుసా..?

ఒక‌టి రెండు తేనె టీగ‌లు త‌రిమితేనే మ‌న‌కు విప‌రీమైత‌న భ‌యం వేస్తుంది. వెంట‌నే వాటి నుంచి త‌ప్పించుకోవ‌డానికి చూస్తాం. ఇక వందల సంఖ్య‌లో తేనెటీగలు వెంట‌బ‌డితే ప‌రుగు లంకించుకుంటాం. వాటి నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తాం. ఎందుకంటే ఒక్క తేనెటీగ కుట్టినా అది క‌లిగించే నొప్పి, బాధ చెప్ప‌లేనిది. అలాంటిది ఏకంగా ఆమె 20వేల తేనెటీగ‌ల‌ను ఒంటిపై వాలించుకుంది. అంత‌టితో ఆమె ఊరుకోలేదు. అలా తేనెటీగ‌లు వాలిన‌ప్పుడు ఫొటోషూట్ చేసింది. దీంతో ఇప్పుడా ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. ఇక్క‌డ ఇంకో చెప్పుకోద‌గిన విష‌యం ఏమిటంటే… ఆ మ‌హిళ నిండు గ‌ర్భ‌వ‌తి మ‌రి..!

ఆమె పేరు ఎమిలీ మ్యుయెల్ల‌ర్‌. అమెరికా వాసి. ఆమె త‌న భ‌ర్త ఇద్ద‌రూ క‌లిసి 2015వ సంవ‌త్స‌రంలో మ్యుయెల్ల‌ర్ బీ కంపెనీ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. అది అమెరికాలోని ఓహియ‌న్ ప్రాంతంలో ఉంది. దీని ఉద్దేశం ఏమిటంటే… తేనెటీగ‌ల‌ను ర‌క్షించాల‌ని, వాటికి పున‌రావాసం క‌ల్పించాల‌నేది వీరి ప్లాన్‌. అందులో భాగంగానే కంపెనీ పెట్టారు. తేనెటీగ‌ల‌ను ర‌క్షించి వాటి ద్వారా తేనెను సేక‌రించి విక్ర‌యిస్తున్నారు.

అయితే ఎమిలీ గ‌ర్భం దాల్చింది. ఇప్పుడామె నిండు గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌మ కంపెనీలో ఉండే తేనెటీగ‌ల ఫాం వ‌ద్దకు వెళ్లి వాటిని ఒంటిపై వాలించుకుంది. మొత్తం 20వేల తేనెటీగలు ఆమెపై వాలాయి. అలా అవి చేర‌గానే వాటితో ఫొటోషూట్ చేసింది. అనంత‌రం వాటిని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. దీంతో అవి కాస్తా వైర‌ల్ అయ్యాయి. ఓ వైపు గ‌ర్భంతో ఉండి మ‌రో వైపు తేనెటీగ‌ల‌తో అంత‌టి సాహ‌సం చేసినందుకు ఆమెకు అంద‌రి నుంచి అభినంద‌న‌లు ల‌భిస్తున్నాయి. అవును మ‌రి, నిజంగా అది డేరింగ్ స్టంటే క‌దా..! ఇంత‌కీ.. మ‌రి అన్ని తేనెటీగ‌లు వాలినందుకు ఆమెకు ఏమీ కాలేదా..? అంటే.. అవును కాలేదు. అలా ఏమీ కాద‌ని తెలుసు కాబ‌ట్టే ఆమె ఆ స్టంట్ చేసింది. ఏది ఏమైనా ఇది షాకింగ్ స్టంట్ అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు..!

Comments

comments

Share this post

scroll to top