ఆ పెళ్లికూతురు ఇప్పుడు వరల్డ్ ఫేమస్.

వ్యక్తిగత జీవితంకన్నా వృత్తికే ప్రాదాన్యత ఇచ్చిన ఓ నర్సు ఇప్పుడు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వరుడి చేయిపట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయంలో  ఆనంద సమయంలో సాహసానికి ఒడిగట్టి  ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. చైనాలోని గు యాన్ అనే అందమైన యువతి తన శాయశక్తులా ప్రయత్నించి ఓ యువకుడికి జీవంపోయడానికి  ప్రయత్నించింది .

నర్సుగా పని చేస్తున్న యాన్ పెళ్లికూతురుగా ముస్తాబై సముద్ర తీరంలో ఫోటోలకు ఫోజులిస్తున్నది. అదేసమయంలో సముద్రం లో ఓ యువకుడు మునిగి పోతున్న దృష్యాన్ని చూసి వెంటనే స్పందించి వెంటనే అతడిని  ఒడ్డుకు తీసుకువచ్చింది. అయితే అప్పటికే అతనిలో చలనం లేదు,  గుండె కొట్టుకోవడం కూడా ఆగింది . వెంటనే ఆలస్యం లేకుండా అతని నోటికి కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసింది. చాతి పై చేతులతో నొక్కింది అతనిని బతికించాలని చాలా కష్టపడింది. ఎంత చేసినా సదరు వ్యక్తి బతకనప్పటికీ….అతనిని బతికించడానికి పెళ్లికూరుకు డ్రెస్ లో ఉన్న నర్స్ చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం వేయినోర్ల కీర్తిస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top