కారు లోపల గర్బిణీ అరుపులు, కార్ బయట ఉన్న డ్రైవర్ ముఖంలో టెంక్షన్.! చివరకు పండంటి పిల్లాడు.

ఢిల్లీలో  ఓ మహిళ పురిటినొప్పులతో  బాధపడుతూ,  అదే పనిగా అంబులెన్స్ కు పలుమార్లు ఫోన్ చేసింది. అయినా అంబులెన్స్ ల నుండి ఎటువంటి స్పందన లేదు, కడుపులోనేమో బిడ్డ కదలికలు ఎక్కువయ్యాయ్…. ఒకటే నొప్పి..ఏ క్షణాన్నైనా డెలివరీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్…ఆమె తల్లడిల్లే విధానం చూస్తే…!!  అతి కష్టం మీద సెల్ ఫోన్ తీసి, క్యాబ్ బుక్ చేసింది… బుక్ చేసిన 2 నిమిషాల్లో క్యాబ్ డ్రైవర్ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. మేడమ్ ఎక్కడికి..? హాస్పిటల్ కు వెళ్లాళి. ఈ స్థితిలో మీరు కార్ లో కూర్చోలేరు, అంబులెన్స్ కు ఫోన్ చేయలేకపోయారా? చేశాను , కానీ రెస్పాన్స్ లేదు.. ప్లీజ్ నొప్పులు భరించలేను తీసుకెళ్లు… సరే మేడమ్ అంటూ….మరో ఇద్దరు మహిళల సహాయంతో ఆమెను కార్ లో ఎక్కించుకున్నాడు ఆ క్యాబ్  డ్రైవర్.

కార్ గవర్నమెంట్ హాస్పిటల్ వైపుగా దూసుకెళుతుంది. దారి మద్యలోనే ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యాయ్… గట్టిగా కేకలు వేస్తుందామె….. వెంటనే కార్ ను సైడ్ ఆపి,  కార్ చుట్టూ పరదా కట్టాడు, తన రేడియేటర్ లోని వేడి నీటిని ఓ టబ్ లోకి తీసి… వాటికి  కొన్ని చన్నీళ్ళను కలిపి…గోరువెచ్చగా అయిన నీటితో పాట తన టవల్ ను ఆ ఇద్దరు మహిళలకు అందించాడు డ్రైవర్.

Baby-born-in-Uber-cab-named-after-firm-4

కార్ లోపల గర్బిణీ అరుపులు,  కార్ బయట ఉన్న డ్రైవర్ ముఖంలో ఒకటే టెంక్షన్……సరిగ్గా ఓ 5 నిమిషాల తర్వాత అప్పుడే పుట్టిన పిల్లాడి ఏడ్పు వినిపించింది అతనికి… అమ్మా , ఏమైంది? కొడుకు పుట్టాడు, తల్లీ బిడ్డ క్షేమం అని ఇద్దరు మహిళలు మూకుమ్మడిగా చెప్పారు. థ్యాంక్స్ దేవుడా అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ డ్రైవర్…. వెంటనే కారును హాస్పిటల్ కు తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు… ఏంటి మీ భార్యా అని అడిగాడు డాక్టర్  ఆ డ్రైవర్ ను, లేదండీ అంటూ జరిగిన వాస్తవాన్ని చెప్పాడు… అతని మాటలకు డాక్టర్ ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నాడు.

పుట్టబోయే బిడ్డ కు ఆ కార్ డ్రైవర్ కు ఏ జన్మ సంబంధమో కాదా.!  మానవత్వం పరిమళించిన వేళ ఇలాంటి అద్భుతాలెన్నో ఈ సృష్టిలో……….   మరో విషయం కార్ డ్రైవర్ పేరు పెట్టుకున్నారు ఈ పిల్లాడికి.

 

Comments

comments

Share this post

scroll to top