ఆ బాలుడు ప‌నిచేసినందుకు జీతం అడిగాడు. అందుకు ఆ మ‌హిళ ఏం చేసిందో తెలుసా..?

ఏ సంస్థ‌లోనైనా, ఎక్క‌డైనా, ఏ వ్య‌క్తి అయినా ప‌ని చేస్తే అందుకు త‌గిన జీతం పొందాల్సిందే. సంస్థ అయితే జీతం వ‌స్తుంది. అదే కూలి అయితే రోజు వారీ మొత్తం లెక్క గ‌ట్టి ఎన్ని రోజులు ప‌నిచేస్తే అంత కూలీ ఇస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రిగిదే. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఓ వ్య‌క్తి వ‌ద్ద ప‌నిచేస్తే అప్పుడు జీతం కొద్దిగా ఆల‌స్య‌మైతే ఎవ‌రైనా ఏం చేస్తారు..? జీతం వెంట‌నే కావాల‌ని అడుగుతారు. ఇది కూడా అంద‌రూ చేసేదే. అయితే ఆ బాలుడు కూడా స‌రిగ్గా ఇదే చేశాడు. తాను చేసిన ప‌నికి గాను ఆ మ‌హిళ‌ను జీతం అడిగాడు. అందుకు ఆ మ‌హిళ ఏం చేసిందో తెలుసా..? ఆ బాలుడి కుడి చేయిని నిర్దాక్షిణ్యంగా న‌రికి అవ‌త‌ల పారేసింది. హృద‌య విదార‌క‌మైన ఈ సంఘ‌ట‌న జ‌రిగింది పాకిస్థాన్‌లో..!

అది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతం (అక్క‌డ కూడా ఉంది). షేక్‌పుర గ్రామం. లాహోర్‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అక్క‌డే జ‌న్న‌త్ బీబీ అనే మ‌హిళ జీవిస్తోంది. అతని కుమారుడి పేరు ఇర్ఫాన్‌. అయితే ఇర్ఫాన్‌ది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని అత్యంత నిరుపేద కుటుంబం. దీంతో అత‌ను కూడా ప‌నిలోకి వెళ్లేవాడు. అత‌ని వ‌య‌స్సు 13 సంవ‌త్స‌రాలు. ఈ క్ర‌మంలోనే బాల కార్మికుడు అని తెలిసి కూడా స్థానికంగా ఉన్న ష‌ఫ్క‌త్ బీబీ అనే మ‌హిళ ఇర్ఫాన్‌ను ప‌నిలో పెట్టుకుంది. ఆమె వ‌ద్ద ఉన్న గొర్రెల‌ను ఇర్ఫాన్ బ‌య‌టికి తీసుకెళ్లి సాయంత్రానికి ఇంటికి తోలుకొచ్చేవాడు. అయితే నెల కావ‌డంతో ఎంత‌కీ జీతం ఇవ్వ‌డం లేద‌ని చెప్పి ఇర్ఫాన్ ఓ రోజున ష‌ఫ్క‌త్ బీబీ ని జీతం అడిగాడు. అత‌నికి మ‌న క‌రెన్సీ ప్ర‌కారం రూ.3వేలు రావాలి.

అయితే జీతం అడిగాడ‌ని చెప్పి ఇర్ఫాన్ కుడి చేతిని ష‌ఫ్క‌త్ బీబీ క‌ట్ చేసింది. అక్క‌డికక్క‌డే జీతం అడిగిన వెంట‌నే ఆ బాలుడి కుడి చేతిని గ‌డ్డి క‌త్తిరించే యంత్రంతో క‌ట్ చేసి పారేసింది. దీంతో ఆ బాలుడి బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో చాలా మంది ష‌ఫ్క‌త్ బీబీ చేసిన ప‌నిని ఖండించారు. అస‌లు బాల కార్మికుడిని ప‌నిలో పెట్టుకోవ‌డ‌మే నేరం, స‌రే పెట్టుకుంది, మ‌రి జీతం అడిగితే ఇవ్వాలి క‌దా. అలా చేయ‌కుండా అతని చేతిని న‌ర‌క‌డం ఏంట‌ని అందరూ మండిప‌డ్డారు. ఈ విష‌యం పోలీసుల‌కు కూడా తెలియడంతో ఇర్ఫాన్ త‌ల్లి ఫిర్యాదు మేర‌కు వారు కేసు రిజిస్ట‌ర్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా… ఇలాంటి క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top