ఫోన్ లో వేధిస్తున్న పోకిరికి చెప్పుదెబ్బతో బుద్ది చెప్పిన మహిళ.

ఫోన్ చేస్తాడు..అసభ్యపదజాలంతో వేధిస్తుంటాడు…ఎన్నిసార్లు తిట్టినా వినిపించుకోడు.. దీంతో అతని ప్రవర్తనపై విసిగిన ఓ మహిళ సదరు వ్యక్తికి చెప్పుదెబ్బతో బుద్దిచెప్పింది. ఈ ఘటన కాకినాడలో జరిగింది. పెయింటర్ గా పని చేస్తున్న వ్యక్తి ఓ మహిళకు అదే పనిగా ఫోన్ చేస్తూ విసిగించేవాడు…లైగింక వేధింపులకు గురిచేసేవాడు. ఎన్ని సార్లు మంచి మాటలతో చెప్పిన సదరు వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాక పోగా… తన నుండి వేధింపులు ఎక్కువయ్యాయ్… దీంతో  ఆ మహిళ ఎలాగైన ఫోన్ లో విసిగించే వ్యక్తికి బుద్ది చెప్పాలని ఫిక్స్ అయ్యింది.  నిన్ను కలవాలి… కాకినాడ కలెక్టరేట్ దగ్గరికి రమ్మని అతనికి ఫోన్లో చెప్పింది. అనుకున్న సమయానికి అతడు అక్కడికి రాగానే ఆ మహిళ ఒక్కసారిగా అతని పై విరుచుకుపడింది, చెప్పుతో రెండు చెంపలను వాయించేసింది.  అనంతరం పోలీసులు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ధైర్యంగా పోకిరి వెధవకు బుద్ది చెప్పిన మహిళకు అభినందనలు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top