ఆ బ‌స్సులో రూ.1కే 17 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌వ‌చ్చు తెలుసా..?

కేవ‌లం ఒక రూపాయికి ఎవరైనా 17 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేస్తారా..? అస‌లది సాధ్య‌మ‌వుతుందా..? సొంత టూ వీల‌ర్ వాడినా పెట్రోల్‌కు రూపాయి క‌న్నా ఎక్కువే అవుతుంది. ఇక ప్ర‌భుత్వ ర‌వాణా సౌక‌ర్యాలు స‌రే స‌రి. వాటిలో అలా త‌క్కువ ధ‌రకు ప్ర‌యాణించ‌డం అస‌లు సాధ్యం కాని ప‌ని. కానీ… ఆ గ్రూప్ వారు త‌యారు చేసిన గ్యాస్ నింపితే ఏకంగా బ‌స్సులోనే కేవ‌లం రూ.1 చెల్లించి ఎంచ‌క్కా 17 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఇంత‌కీ ఏంటా గ్రూప్‌..? ఎక్కడుంటుంది..? ఏం చేస్తుంది..?

వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌క‌తాకు చెందిన ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్ అది. దాని ప్ర‌తినిధులు కొంద‌రు ఆవు పేడ‌తో ఇటీవ‌లే బ‌యో గ్యాస్ త‌యారు చేశారు. ఆ గ్యాస్‌ను ఇంధ‌నంగా వాడుతూ ఓ బ‌స్సును ఆ న‌గ‌రంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ క్రమంలో మొత్తం దూరం 17.5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వ‌చ్చింది. అయితే అందుకు అయిన ఇంధ‌నం ఖ‌ర్చు, అందులో ప్ర‌యాణించిన ప్ర‌యాణికుల సంఖ్య‌ను లెక్కిస్తే తెలిసిందేమిటంటే… ఆ గ్యాస్ వాడ‌డం వ‌ల్ల ఏకంగా 17 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం రూ.1 ఖ‌ర్చుతో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలిసింది.

దీంతో ఇది ప్ర‌పంచంలోనే అత్యంత చ‌వ‌కైన ప్ర‌యాణంగా గుర్తింపు కూడా పొందింది. అయితే ఇప్ప‌టికి అలాంటి గ్యాస్‌తో న‌డిచే బ‌స్సు ఒక్క‌టి మాత్ర‌మే ఉండ‌గా, త్వ‌ర‌లోనే 15 బ‌స్సుల‌ను కోల్‌క‌తా న‌గ‌రంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అటు త‌రువాత మ‌రిన్ని బ‌స్సుల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేనున్నారు. దీంతో ర‌వాణా చార్జిల భారం ఇక‌పై ఆ ప్ర‌జ‌ల‌కు ప‌డే అవ‌కాశం లేదు. అలాంటి బ‌స్సుల‌ను దేశ‌మంత‌టా వాడితే అప్పుడు జ‌నాల‌కు ఎంత‌గానో ఉప‌యోగంగా ఉంటుంది క‌దా. ఎంచ‌క్కా నెల నెలా పెట్టే ర‌వాణా చార్జీలు పొదుపు అవుతాయి. ఎంతో విలువైన ఇంధ‌నం ఆదా అవుతుంది కూడా.

Comments

comments

Share this post

scroll to top