దేశం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుందాం ఇలా…

ఒక‌ప్పుడంటే ఏ ప‌త్రిక‌లోనో, టీవీ ఛాన‌ల్‌లోనో ఏదైనా క‌థ‌నాన్ని చూసో, చ‌దివో ఆర్థికంగా డ‌బ్బులు అత్యంత అవ‌స‌రం ఉన్న వారిని ఆదుకునే వారు. అయితే ఇప్పుడు కూడా అనేక మంది దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థలు ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూసే వారిని ఆదుకుంటూనే ఉన్నారు లెండి. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని, ఇప్పుడు మ‌న‌కు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్ వంటి మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్న ఇలాంటి ఆదుకునే మెసేజ్‌ల‌లో చాలా వ‌ర‌కు న‌కిలీవే ఉంటున్నాయి. దీంతో అస‌లైన స‌హాయం కావల్సిన వారికి ఆ స‌హాయం ద‌క్క‌డం లేదు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మాత్రం అలాంటి సోష‌ల్ మాధ్య‌మాల్లో ఎవ‌రో షేర్ చేసిందో, లేదంటే ఎవ‌రో ఊహాజ‌నితంగా సృష్టించింది మాత్రం కాదు. ఇది భార‌త సైనికుల సంక్షేమం కోసం సాక్షాత్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న వెల్ఫేర్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌. నిజంగా నిజ‌మైన సంస్థే ఇది. ఈ సంస్థ‌కు విరాళాల‌ను పంపితే అది దేశ ర‌క్ష‌ణకు పాటు ప‌డుతున్న సైనికుల స‌హాయ‌ర్థం వారి వారి కుటుంబాల‌కు అంద‌జేయ‌బ‌డుతుంది.

army-died-funeral

ఆర్మీ ద‌ళాలు, పారా మిల‌ట‌రీ ద‌ళాల్లో ప‌నిచేస్తూ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది లేదా అవ‌య‌వాలు కోల్పోయి మంచానికే ప‌రిమిత‌మైన వీర సైనికుల కోసం, వారి కుటుంబాల‌ను ఆదుకోవ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ది నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్ అని ఒక ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హింప‌బ‌డుతోంది. దీనికి సాక్షాత్తూ దేశ ప్ర‌ధానే చైర్ ప‌ర్సన్‌గా ఉన్నాడు. ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, హోం శాఖల‌కు చెందిన మంత్రులు ఈ సంస్థ కార్య‌నిర్వాహక క‌మిటీ మెంబ‌ర్లుగా ఉన్నారు. ఈ సంస్థ‌కు ఉండే బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్, దాని నిర్వ‌హ‌ణ‌, అందులోకి చేరే నిధుల‌న్నీ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వ‌ద్ద ఉంటాయి. ఈ బ్యాంక్ అకౌంట్‌లోకి వ‌చ్చే నిధుల‌న్నింటినీ పైన చెప్పిన స‌ద‌రు సైనిక కుటుంబాల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు.

ఎవ‌రైనా త‌మ స‌హాయాన్ని విరాళం రూపంలో పంపాల‌నుకుంటే ఆన్‌లైన్ ద్వారా నేరుగా Syndicate Bank, A/C No. 90552010165915, IFSC Code: SYNB0009055 అకౌంట్‌కు ఎంతైనా డ‌బ్బులు పంప‌వ‌చ్చు. ఈ ఫండ్ పేరు Army Welfare Fund Battle Causalities. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్, డిఫెన్స్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో ఈ బ్యాంక్ బ్రాంచ్ ఉంది.

indian-army-fund indian-army-fund

పైన తెలిపిన వివ‌రాలు పూర్తిగా వాస్త‌వ‌మైన‌వే. కావాల‌నుకుంటే భార‌త ప్ర‌ధాని వెబ్‌సైట్ http://www.pmindia.gov.in/en/national-defence-fund/ ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇదే విష‌యంపై ఇండియ‌న్ ఆర్మీ అధికారులు కూడా త‌మ ట్విట్ట‌ర్ అధికారిక ఖాతాలో క్లారిఫికేష‌న్ కూడా ఇచ్చారు. కాబ‌ట్టి మీరు స‌హాయం చేస్తే అది చ‌నిపోయిన మ‌న దేశ సైనికుల కుటుంబాల‌కు చేరుతుంది. దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌గ‌లుగుతారు. అది వారి కుటుంబాల‌కు ఎంత‌గానో చేయూత‌నిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top