ఇలా చేయండి…రేపటి నుండి కూరగాయలు కొనడమే బంద్ చేస్తారు…

రసాయ‌నాల‌తో పండించిన కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను తిన‌లేక‌పోతున్నారా..? ఇంట్లో కూర‌గాయ‌ల‌ను పండిద్దామంటే అందుకు త‌గిన స్థ‌లం లేదా? స‌్వ‌చ్ఛమైన‌, స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తుల్లో పండించిన వెజిట‌బుల్స్‌ను తినాల‌నుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మీకోస‌మే. ఇంట్లో ఎంత త‌క్కువ స్థ‌లం ఉన్నా, కృత్రిమ ఎరువుల అవ‌స‌రం లేకుండా, స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌ల‌ను పండించుకోగ‌లిగే ఓ ప్ర‌త్యేక‌మైన విధానం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చింది. అదే హైడ్రోపోనిక్స్ (Hydroponics) విధానం.

hydroponicsచిత్రంలో చూశారుగా! ఒక చిన్న‌పాటి వాట‌ర్ ట్యాంక్ కింద అమ‌ర్చ‌బ‌డి ఉంటుంది. దానిపై కొద్ది దూరంలో ట‌బ్ లాంటి మ‌రో ట్యాంక్ అమ‌ర్చ‌బ‌డి ఉంటుంది. కింది ట్యాంక్‌లో మొక్క‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో కూడిన ప్ర‌త్యేక మిశ్ర‌మం ఉంటుంది. పై ట్యాంక్‌లో చిత్రంలో చూపిన‌ట్టుగా మొక్క‌లు ఉంటాయి. వాటి వేర్ల భాగాలు మాత్ర‌మే నీటిలో ఆనుతూ ఉంటాయి. కింది ట్యాంక్ నుంచి పై ట్యాంక్‌కు మిశ్ర‌మం వెళ్లేందుకు, మ‌ళ్లీ ఆ మిశ్ర‌మం కింది ట్యాంక్‌కు వ‌చ్చేందుకు రెండు వేర్వేరు విభాగాలు ఉంటాయి. చిత్రంలో చూపిన‌ట్టుగా ఈ హైడ్రోపోనిక్స్ వ్య‌వస్థ‌ను అమ‌ర్చిన త‌రువాత స్విచ్ ఆన్ చేస్తే కింది ట్యాంక్‌లోని మిశ్ర‌మం పై ట్యాంక్‌లోకి వెళ్లి మొక్క‌ల వేర్ల భాగాల‌ను త‌డుపుతుంది. దీంతో ఆ మిశ్ర‌మంలో ఉండే పోష‌కాల‌ను మొక్క‌లు గ్ర‌హించి అవి పెరుగుతాయి. అనంత‌రం కొద్ది రోజుల‌కు ఆ మొక్క‌ల‌కు కూర‌గాయ‌లు కాస్తాయి. అయితే రోజులో కేవ‌లం అవ‌స‌ర‌మున్న‌ప్పుడు మాత్ర‌మే కింది ట్యాంక్‌లోని మోటార్‌ను ఆన్ చేయాలి. దీంతో మొక్క‌ల‌కు స‌రైన స‌మ‌యంతో పోష‌ణ అందుతుంది. కాగా పై ట్యాంక్‌లో మిగిలిన మిశ్ర‌మం మ‌ళ్లీ కింద‌కి వ‌స్తుంది కాబ‌ట్టి దాన్ని మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌చ్చు. సో, హైడ్రోపోనిక్స్ వ్య‌వ‌స్థ ఇలా ప‌నిచేస్తుంద‌న్న‌మాట‌. కాక‌పోతే సూర్య‌ర‌శ్మి కూడా మొక్క‌ల‌కు అవ‌స‌రం కాబ‌ట్టి ఏదైనా ఎండ త‌గిలే ప్ర‌దేశంలో ఈ వ్య‌వ‌స్థ‌ను ఉంచితే చాలు. స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో పండించిన కూర‌గాయ‌ల‌ను ఎంచ‌క్కా మీరు తిన‌వ‌చ్చు. దీంతో నిత్యం మార్కెట్‌కు వెళ్లే బాధ మీకు త‌ప్పుతుంది. కూర‌గాయల‌కు అధిక డ‌బ్బు వెచ్చించాల్సిన ప‌ని కూడా ఉండదు.

సాధార‌ణంగా పండే పంటల క‌న్నా హైడ్రోపోనిక్స్ ప‌ద్ధ‌తిలో పండే పంట‌లు 50 శాతం త్వ‌ర‌గా పెరుగుతాయ‌ట‌. దీనికి తోడు సంవ‌త్స‌రం మొత్తం ఈ పంట‌ల‌ను పండిస్తూనే ఉండ‌వ‌చ్చ‌ట‌. మ‌ధ్య‌లో ఎలాంటి బ్రేక్ ఇవ్వాల్సిన ప‌నిలేద‌ట‌. కృత్రిమ ఎరువుల అవ‌స‌రం ఉండ‌దు కాబ‌ట్టి ఎంతో స్వచ్ఛ‌మైన‌, స‌హ‌జ‌మైన పంట చేతికి వ‌స్తుంది. ఇక‌పోతే ఈ సిస్ట‌మ్‌లో వాడే మిశ్ర‌మం మ‌ళ్లీ మ‌ళ్లీ ఉప‌యోగ‌ప‌డుతుంది కాబ‌ట్టి నీటి అవ‌స‌రం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. అంతేకాదు, ఇంట్లో బాల్క‌నీ వంటి ప్ర‌దేశం ఉన్నా ఈ త‌ర‌హా సిస్ట‌మ్ ద్వారా పంట‌ల‌ను సుల‌భంగా త‌క్కువ ఖ‌ర్చుతోనే పండించ‌వ‌చ్చ‌ట‌. అయితే ఒక్కో ర‌క‌మైన మొక్క‌కు ఒక్కో రీతిలో పోష‌ణ అవ‌స‌రం అవుతుంది కాబ‌ట్టి దాని కోసం వాడే మిశ్ర‌మాన్ని మాత్రం మార్చాల్సి ఉంటుంది. కానీ ఆ మిశ్ర‌మాన్ని ఇంటి వ‌ద్దే త‌యారు చేసుకోవ‌చ్చు.

25 ఎంఎల్ కాల్షియం నైట్రేట్ (CaNO3), 1.7 ఎంఎల్ పొటాషియం స‌ల్ఫేట్ (K2SO4), 8.3 ఎంఎల్ పొటాషియం నైట్రేట్ (KNO3), 6.25 ఎంఎల్ మోనో పొటాషియం పాస్ఫేట్ (KH2PO4), 17.5 ఎంఎల్ మెగ్నిషియం సల్ఫేట్ (MgSO4) ల‌ను 20 లీట‌ర్ల ఫిల్ట‌ర్ నీటిలో క‌ల‌పాలి. దీంతో మీకు కావ‌ల్సిన మిశ్ర‌మం త‌యార‌వుతుంది. దీని ద్వారా నైట్రోజ‌న్‌, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, స‌ల్ఫ‌ర్‌, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాపర్‌, మాంగ‌నీస్‌, జింక్‌, మాలిబ్డినం, బోరాన్ వంటి పోష‌కాలు మొక్క‌ల‌కు స‌రిగ్గా అందుతాయి.

hydroponics
హైడ్రోపోనిక్స్ విధానంలో 3 ర‌కాలుగా మొక్క‌ల‌ను పెంచ‌వ‌చ్చు. అందులో ఒక‌టి హైడ్రోపోనిక్ రాఫ్ట్‌. ఇది చిత్రంలో పైన చూపిన విధంగా ఉంటుంది. దీంట్లో మ‌న‌కు కావల్సిన సైజుల్లో సిస్ట‌మ్ ల‌భిస్తుంది. రెండ‌వ‌ది వెర్టిక‌ల్ హైడ్రోపోనిక్స్‌. ఇంట్లో త‌క్కువ ప్లేస్ ఉన్న వారికి ఇది ప‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇక మూడ‌వ‌ది ఆక్వాపోనిక్స్‌. ఇది కూడా దాదాపుగా పై రెండు నిర్మాణాల‌ను పోలి ఉంటుంది. తోట‌లో నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌దేశంలో దీన్ని సుల‌భంగా అమ‌ర్చుకోవ‌చ్చు. అయితే ఈ మూడింటిలో మ‌న‌కు కావ‌ల్సిన హైడ్రోపోనిక్స్ సిస్ట‌మ్‌ను ఎంచుకుని ఎంచ‌క్కా కూర‌గాయ‌ల‌ను సాగు చేయ‌వ‌చ్చు. దీంతో బెంబేలెత్తించే కూర‌గాయ‌ల బాధ మ‌న‌కు త‌ప్పుతుంది. అంతేగా మ‌రి!

Comments

comments

Share this post

scroll to top