శివరాత్రి రోజు 100 ల లీటర్ల “పాలు” వృధా అవ్వకూడదని ఆ విద్యార్థులు తెలివిగా ఏం చేసారంటే.?

ప్ర‌తి ఏటా వ‌చ్చే మ‌హా శివ‌రాత్రి రోజే కాదు.. ప్ర‌తి సోమ‌వారం శివాల‌యాల్లోనూ భ‌క్తులు శివ‌లింగానికి పాల‌ను తెచ్చి అభిషేకం చేస్తుంటారు. దీని వ‌ల్ల వారు కోరుకున్న కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని, త‌మ క‌ష్టాలు తీరిపోతాయ‌ని, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం క‌లుగుతాయ‌ని వారు న‌మ్ముతారు. అయితే ఇది క‌రెక్టే అయిన‌ప్ప‌టికీ వాస్త‌వానికి ఆలోచిస్తే శివ లింగానికి పాల‌తో చేసే అభిషేకం వ‌ల్ల ఎన్నో ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు వృథా అవుతుంటాయి. మ‌న దేశంలో ఎంతో మంది పిల్ల‌లు సంపూర్ణ పోష‌కాహారం అంద‌క అవ‌స్థ‌లు ప‌డుతుంటే మ‌రో వైపు ఇలా పాల‌ను అభిషేకం కోసం వృథా చేయ‌డం వారికి ఏమాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ఆ యువ‌త ఏం చేసిందో తెలుసా..!

అత‌ని పేరు క‌ర‌ణ్ గోయ‌ల్‌. వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. ఉంటున్న‌ది మీర‌ట్‌లో. పైన చెప్పిన ఆలోచ‌న ఇత‌నికే వ‌చ్చింది. దీంతో అత‌ను ఏం చేశాడంటే.. శివ‌రాత్రి రోజున మీర‌ట్‌లో ఉన్న బిలేశ్వ‌ర్ నాథ్ ఆల‌యంలో శివ‌లింగంపై ఒక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ను ఏర్పాటు చేశాడు. దానికి రెండు రంధ్రాలు ఉంటాయి. ఈ క్రమంలో భ‌క్తులు ఆ పాత్ర‌లో పాలు పోసిన‌ప్పుడు ఒక రంధ్ర గుండా పాలు చాలా నెమ్మ‌దిగా శివ‌లింగం మీద ప‌డుతుంటాయి. మ‌రో రంధ్రం గుండా పాలు దానికి అమ‌ర్చ‌బ‌డిన ప్ర‌త్యేక పైపు ద్వారా మ‌రో పాత్ర‌లోకి వెళ్తాయి. దీంతో ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ రోజున మొత్తం దాదాపుగా 125 లీట‌ర్ల పాలు వృథా కాకుండా చూశారు.


అయితే క‌ర‌ణ్ గోయ‌ల్ ఆ పాల‌ను ఏం చేశాడో తెలుసా..? త‌న స్నేహితుల‌తో క‌లిసి స్థానికంగా ఉన్న అనాథాశ్ర‌మంలోని పిల్ల‌ల‌కు పంచాడు. వారికి గ్లాసుల్లో పాల‌ను పోసి ఇచ్చాడు. దీంతో వారికి క‌లిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఈ ఘ‌ట‌న అనంతరం ఆల‌యంలో ఉంచిన స‌ద‌రు పాత్ర‌ను ఆల‌య సిబ్బందికే ఇచ్చేశారు. దీంతో పాల‌తో ఎవ‌రైనా అభిషేకం చేస్తే అవి వృథా కాకుండా సేక‌రించ‌వ‌చ్చ‌ని, దాంతో వ‌చ్చే పాల‌ను అనాథ పిల్ల‌ల‌కు ఇవ్వ‌వ‌చ్చ‌ని అత‌ను ఆల‌య సిబ్బందికి చెప్పాడు. దీనికి ఆల‌య సిబ్బంది కూడా అంగీక‌రించారు. అవును మ‌రి, మంచి ప‌ని చేస్తుంటే ఎవ‌రు మాత్రం దానికి అంగీక‌రించ‌రు చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top