విషెస్ చెప్పిన “షమీ”..! మరో కేసు పెట్టిన “హసీన్”..! అసలేమైందో తెలుసా.?

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి త‌న భార్య నుంచి వ‌స్తున్న క‌ష్టాలు ఇప్ప‌ట్లో త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే గృహ హింస కేసులో ఇరుక్కున్న షమీ ఫిక్సింగ్ ఉదంతం నుంచి బ‌య‌ట ప‌డ‌డంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ క్ర‌మంలో ఎప్ప‌టిక‌ప్పుడు అత‌ను త‌న భార్య‌కు ద‌గ్గ‌ర కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మాత్రం అత‌ని నుంచి దూరంగా ఉండేందుకే య‌త్నిస్తోంది. తాజాగా ష‌మీ త‌న భార్య‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు చెప్పాడు. అయినా ఆమె నుంచి స్పంద‌న రాలేదు. పైగా ఆమె నుంచి ష‌మీకి మ‌రో కొత్త క‌ష్టం వ‌చ్చి ప‌డింది.

క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, త‌న భార్య హ‌సిన్ జ‌హాన్‌కు ఈ మ‌ధ్యే త‌మ నాలుగో వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌ల‌ను చెప్పాడు. త‌న‌ను బాగా మిస్ అవుతున్నాన‌ని చెబుతూ.. మిస్ యూ అని ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టాడు. అయితే ఆ పోస్టు పెట్టినా అటు నుంచి హ‌సిన్ జ‌హాన్ స్పందించ‌లేదు. పైగా ఆమె ష‌మీపై అదే స‌మ‌యంలో కోర్టులో మ‌రో కేసు పెట్టింది. ష‌మీ గ‌తంలో ఇచ్చిన చెక్‌ల‌ను మార్చుకునేందుకు హ‌సిన్ జ‌హాన్ ఇటీవ‌ల‌ య‌త్నించ‌గా వాటిని ష‌మీ బ్లాక్ చేయ‌డంతో బ్యాంక్ అధికారులు ఆమెకు డ‌బ్బులు ఇచ్చేందుకు నిరాక‌రించారు. దీంతో హ‌సిన్ జ‌హాన్ తాజాగా కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం కింద పిటిషన్ వేస్తూ తనకు, తన కుమార్తెకు భరణం చెల్లించేలా షమీని ఆదేశించాలని కోర్టును కోరింది.

ఓ వైపు ష‌మీ త‌న భార్య‌కు వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతూ ఆమెకు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని య‌త్నించాడు. అయిన‌ప్ప‌టికీ హ‌సిన్ జ‌హాన్ మాత్రం కోర్టులో త‌న‌కు ష‌మీ నుంచి నెల నెలా భ‌ర‌ణం ఇప్పించాల‌ని కేసు వేసింది. ఇక ఈ విష‌యం చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇప్ప‌టికే గృహ హింస కేసులో ఇరుక్కున్న ష‌మీకి ఈ భ‌ర‌ణం కేసు అద‌నం కానుంది. ప్ర‌స్తుతం ష‌మీ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతున్నాడు. ఫిక్సింగ్ ఉదంతం నుంచి క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌ప‌డిన ష‌మీకి బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టు ల‌భించ‌డంతో కొంత ఊర‌ట ద‌క్కినా, గృహ హింస కేసు నుంచి అత‌నికి విముక్తి ల‌భించే అవ‌కాశం దాదాపుగా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు ఇది ఎలా ముగుస్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top