ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రోలో భారీగా ఐటీ ఉద్యోగులను తొలగించారు. హెచ్ 1 బీ వీసాలపై రీసెంట్ గా అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు..ఆ దేశాధ్యక్షుడు ట్రంప్. ఆస్ట్రేలియాలో.. 452 రకం వీసాలను తాజాగా రద్ధు చేసింది. అంతకు ముందు సింగపూర్ కూడా భారత ఐటీ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసా, తాత్కాలిక వీసాల మీద క్లైంట్స్ ద్వారా విదేశాలకు వచ్చి పనిచేస్తున్నారు కొంతమంది విప్రో ఉద్యోగులు. 2 వేల మంది ఉద్యోగులను విప్రో నుంచి తొలగించారని అంచనా.
మూడో అతిపెద్ధ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రోలో దేశ వ్యాప్తంగా.. 1.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థలో తొలగింపు సాధారణంగా జరిగే ప్రక్రియ అని సంస్థ అధికారులు వెల్లడించారు. ఎంతమంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు విప్రో.
ఈ నెల 25న.. విప్రో తన చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా అంతకు ముందే సంస్థలో ఉద్యోగులను తొలగించింది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో.. వీసాలపై విధించిన పరిమితుల నేపథ్యంలో ఉద్యోగుల మదింపు తప్పదని సంస్థలో సీనియర్ సిబ్బంది వాదన. భారత ఐటీ కంపెనీలకు ఉత్తర అమెరికా దేశాల నుంచి.. 60 శాతం ఆదాయం వస్తోంది. మరో 20 శాతం యూరపలోని ఇతర దేశాల నుంచి వస్తోంది. కానీ ఇప్పుడు తగ్గముఖం పట్టవచ్చంటున్నారు నిపుణులు.