“సాయి ధరమ్ తేజ్, రకుల్” నటించిన “విన్నర్” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)…! హిట్టా? ఫట్టా?

Movie Title: విన్నర్ (Winner)

Cast & Crew:

 • నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అనసూయ త‌దిత‌రులు
 • దర్శకుడు: గోపీచంద్ మలినేని
 • సంగీతం: థమన్. ఎస్. ఎస్
 • నిర్మాత: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు (లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్)

Story:

అయిదేళ్ల వయసులోనే తల్లితండ్రులకు అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతాడు “రామ్” (సాయి ధరమ్ తేజ్). తరవాత జర్నలిస్ట్ అవుతాడు. అదే సమయంలో హార్స్ రేస్ లో నష్టం ఎదురుకున్న “ధర్మేంద్ర” తన బాధ్యతల్ని తన కొడుకు “జగపతి బాబు” కు అప్పచెప్పుటడు. జర్నలిస్ట్ రామ్ కు క్రీడాకారిణి “సితార” (రకుల్) తో పరిచయం ఏర్పడుతుంది. సితారను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తుంటాడు “రామ్”. కానీ అనుకోని విధంగా “సితార” పెళ్లి విషయంలో ఆమె తండ్రి (సురేష్) ఒక నిర్ణయం తీసుకుంటాడు. సితార తండ్రితో “హార్స్ రేస్” గెలుస్తా అని పందెం కాస్తాడు “రామ్”. ఆ తరవాత “జగపతి బాబు” తో గొడవలు మొదలవుతాయి. చివరికి హార్స్ రేస్ లో గెలిచాడా? “సితార” ను పెళ్లి చేసుకోగలిగాడా? అనేది తెలియాలి అంటే “విన్నర్” సినిమా చూడాల్సిందే!

Review:

స్టోరీ పాతదే. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ, ఫైట్స్, సాంగ్స్ తో సినిమాను ముందుకు నడిపించారు. రకుల్ తన గ్లామర్ తో మరోసారి ఆకట్టుంది. విలన్ గా “జగపతి బాబు” మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. థమన్ అందించిన సంగీతం కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, పెళ్లిచూపులు ప్రియదర్శి, పృథ్వి  కలిసి పండించిన కామెడీకి థియేటర్ లో నవ్వుకోలేక చావాల్సిందే. అనసూయ “సుయా సుయా” సాంగ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ డాన్స్, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయ్!

Plus Points:

 • వెన్నెల కిశోర్, పృథ్వి కామెడీ
 • థమన్ బ్యాక్ స్కోర్
 • రకుల్ ప్రీత్ గ్లామర్
 • సాయి ధరమ్ తేజ్ డాన్స్, ఫైట్స్
 • విలన్ గా “జగపతి బాబు”
 • ఇంటర్వెల్ ట్విస్ట్

Minus Points:

 • రొటీన్ స్టోరీ
 • “రకుల్” కేవలం పాటలకే పరిమితమయ్యింది
 • డైలాగ్స్ బాగున్నాయ్ కానీ “సాయి ధరమ్ తేజ్” సరిగా డెలివర్ చేయలేకపోయాడు

Final Verdict:

కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ “విన్నర్”. “రకుల్” అందాలకోసం, “సాయి ధరమ్ తేజ్” డాన్స్, ఫైట్స్ కోసం, “పృద్వి, కిశోరె” కామెడీ కోసం ఈ సినిమా చూడొచ్చు.

AP2TG Rating: 2.5/5

Trailer:

 

Comments

comments

Share this post

scroll to top