సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరో ప్రకటించారు! ధావన్ కాదు.! మరెవరో తెలుసా..?

బాల్ ట్యాంపరింగ్ వివాదంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఆసీస్ క్రికెటర్ వార్నర్‌పై వేటు పడటంతో ఆ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తూ ఫ్రాంచైజీలు కీలక ప్రకటన చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్‌సన్‌ను నియమిస్తున్నట్లు ఆ జట్టు అధికారికంగా ప్రకటించింది. తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై విలియమ్‌సన్ స్పందించాడు. తాను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని, ఇది తనకెంతో ప్రత్యేకమైనదని విలియమ్‌సన్ చెప్పాడు. ఎంతోమంది టాలెంట్ కలిగిన ఆటగాళ్ల జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉందని తెలిపాడు. మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని విలియమ్‌సన్ దీమా వ్యక్తం చేశాడు.


విలియమ్‌సన్ 2015 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. మొత్తం ఇప్పటివరకూ 15 మ్యాచ్‌లు ఆడి, 411 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మిత్ కూడా బాల్ ట్యాంపరింగ్ వివాదంతో తన స్థానాన్ని కోల్పోయాడు. ఆ జట్టుకు కొత్త కెప్టెన్‌గా రహానేను నియమిస్తున్నట్లు ఆ జట్టు ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రకటన చేశారు. మొత్తం మీద బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఐపీఎల్‌లో కీలకంగా వ్యవహరించాల్సిన ఇద్దరు ఆసీస్ కీలక ఆటగాళ్లు వైదొలగాల్సొచ్చింది.

Comments

comments

Share this post

scroll to top