ప్రశ్నిస్తే చంపేస్తారా…. టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన నాగబాబు.!!

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై నాగ బాబు మండిపడ్డారు. జనసేన కార్యకర్తల అక్రమ అరెస్టులపై స్పందించిన నాగబాబు… మరో సారి ఇలా జరిగితే ఇక తాను రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తానన్నారు. ఈ సందర్భంగా నాగబాబు యూట్యూబ్ ఛానల్ “ నా ఛానల్ నా ఇష్టం” లో 10 నిమిషాల వీడియోను అప్లోడ్ చేసారు. ఇందులో జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంచిన స్టేషన్ విజువల్స్ చూపించారు.


నాగబాబు మాట్లాడుతూ.. ‘మీకు కొన్ని విజువల్స్ చూపిస్తా వాటిని చూడండి.. ఈ వీడియోలో కనిపిస్తున్న వారిని పోలీస్‌లు అరెస్ట్ చేసి గుంటూరు అరండాల్ పేట పోలీస్ స్టేషన్‌కి తరలించి అక్కడ నుండి ఎస్పీ బంగ్లాకు తరలించారు. అక్కడ వాళ్లను బాగా కొట్టి హింసించారు. బాగా గాయపడిన ఓ కుర్రాడు అక్కడే వాంతులు చేసుకుంటే.. ఆసుపత్రికి కూడా తరలించారని మాకు సమాచారం.

ఈ విషయం నాకు కాస్త లేటుగా తెలిసింది. నాకు కరెక్ట్ టైమ్‌లో తెలిస్తే విషయం వేరేలా ఉండేది. సాధినేని యామిని అనే టీడీపీ మహిళా నాయకురాలు మీద జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం అనేది తప్పేంకాదు. కాకపోతే నిజంగా బాధపెట్టేవిగా ఉంటే పరువునష్టం దావా వేయొచ్చు. అంతే కాని అరెస్ట్ చేయకూడదు.

ఇలా అరెస్టులు చేయడం ద్వారా జనసేన కార్యకర్తల మనస్తైర్యాన్ని దెబ్బకొడుతున్నట్టు టీడీపీ నాయకులు భ్రమ పడుతున్నారు. దీనికి లోకేష్, పార్టీ హెడ్‌ చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలి.
జనసేన కార్యకర్తలు ఏమైనా మర్డర్లు చేసారా. ఏ విధంగా వాళ్లని అరెస్ట్ చేసారు. అధికారం లో ఉన్న మీ పార్టీ నాయకురాలిని ఒక్క మాట అంటే అంత రచ్చ చేస్తారా. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా.
మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు రాకూడదని నేను పార్టీలో చేరలేదు. కానీ నేను జనసేన పార్టీకి అభిమానిని. ఇంకో సారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించను. నేను కేవలం ఆన్లైన్ వారియర్ మాత్రమే కాదు. బయటకి వచ్చి పోరాటం చెయ్యగలను. ఇకపై ఎవరైనా జనసేనను భయపెట్టాలని చూస్తే రోడ్డు మీదకు వస్తా. చంపితే చావడానికైనా నేను సిద్ధం.
రండి.. చంపేస్తారా? వచ్చి చంపేయండి. ఒక మంచిపని కోసం చచ్చిపోవడానికి రెడీ. కాని మీలాగా అధికారం చేతిలో ఉంది కదా అడ్డదారిలో వెళ్లం. జనసైనికులు మీ పార్టీని ఎదుర్కొంటారు. వాళ్ల వెనుక నేను ఉన్నాను. బీకేర్ ఫుల్.. ఏదైనా న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్‌లో మీరు గెలిచినా.. మేం గెలిచినా.. జగన్ గెలిచినా.. న్యాయంగానే పోరాడదాం. అంతేకాని పగలు, ప్రతీకారాలు పెట్టుకుని.. ఇలా చేయడం దారుణం.
మీరు మర్యాదగా ఆ బాధితుల్ని క్షమించమని కోరండి. ఇలాంటి అడ్డదారులలో వెళ్లకండి. మీడియా ఎలాగూ వీటిని ప్రసారం చేయదు. ఎందుకంటే ఛానల్స్ అన్నీ చంద్రబాబుకి సపోర్ట్. కాని మాకు సోషల్ మీడియా ఉంది. ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాం’ అంటూ టీడీపీ నాయకురాలు సాధినేని యామినికి గట్టి కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

Comments

comments

Share this post

scroll to top