కేసి కాలువ చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తాం-ఏపి మంత్రి అఖిల ప్రియ

babai babai

నంద్యాల (ఏపి 2 టిజి): కర్నూలు కడప కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఏపి మంత్రి అఖిల ప్రియ రైతులకు హామీ ఇచారు. కర్నూల్ కడప కాలువ పరిదిలోని నంద్యాల మండలం అయ్యలూరు నుండి బందిఅత్మకూర్ మండలం సంతజూటుర్ పిక్ అప్ ఆనకట్ట వరకు కేసి పరివాహక ప్రాంతాన్ని ఆమె సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ పరిధిలోని రైతుల సమస్యలను ఆమె ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు

అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఖరిఫ్ లో వర్షా భావ పరిస్తులవల్ల సాగునీటి వినియోగం పెరిగిందన్నారు. దీనికి తోడు నాన్ ఆయకట్టు కూడా విపరీతంగా పెరగడం వల్ల టైల్ ఎండ్ కి నీటి సరఫరా తగ్గుతోన్దన్నారు. దీనికి తోడు కాల్వ వెంబడి లీకేజె లు ఉండటంతో నీటి వృధా జరుగుతోందన్నారు. ఆయకట్టు  పరిధిలో ఆయకట్టు రెండులక్షల అరభై వేల ఎకరాలు వుండగా నాన్ ఆయకట్టు రెండులక్షలు ఉందన్నారు.గతంలో దివంగత ఎం ఎల్ ఎ భూమ నాగిరెడ్డి ప్రతి పాదన మేరకు వర్షాభావ పరిస్తుతలలో శ్రీశైలం 790 అదుగుల వద్ద సుంకేసుల కు ఎత్తిపోతల ద్వార నీటి సరఫరా చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ముచుమర్రి వద్ద మరో రెండు లిఫిటింగ్ పంపులు ఏర్పాటు చేసి సాగు నీటి సమస్యలు లేకుండా చేస్తామని ఈ సందర్బంగా మంత్రి అఖిల రైతులకు హామీ ఇచారు. పర్యటనలో మంత్రి వెంట ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు

Comments

comments