సెల్ఫీల నుండి పడకగది సీన్ల రికార్డ్ వరకు స్మార్ట్ ఫోన్!దీని వల్లే నూతన దంపతుల ఆత్మహత్య..

ఓ స్మార్ట్ ఫోన్ రెండు నిండు జీవితాలను బుగ్గిపాలు చేసింది. ఇది టెక్నాలజీ వీర విహారమా?లేక వాడే వారి విచ్చలవిడితనమో  కానీ  నూతన దంపతులు మాత్రం దానికి బలైపోయారు. ఫోటో లు , సెల్పీ ల నుండి పడకగది సీన్లను కూడా రికార్డ్ చేసుకునే దాకా వచ్చింది స్మార్ట్ ఫోన్ల ఉపయోగం. దీని కారణంగానే నూతన జంట ఆత్మహత్య చేసుకున్నారు…

వివరాల్లోకెళితే  కొత్తగా పెళ్ళైన జంట, చిలకాగోరింకల్లా అన్యోన్యంగా గడిపేవారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఆ దంపతులిద్దరూ  తాము ‘సన్నిహితంగా’  ఉన్న శృంగార దృశ్యాలను  వారి స్మార్ట్  ఫోన్‌లో చిత్రీకరించుకున్నారు. కానీ నెలరోజుల క్రితం వారు చేసిన  ఒక ప్రయాణంలో  ఆ ఫోన్‌ పోయింది.

WIFE AND HUSBAND

దీంతో ఆ ఫోన్ దొరికిన వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసి చూశాడు. వీడియో పోల్డర్ ఓపెన్ చేసి చూడాగానే ఒక్కసారిగా అవాక్కయ్యాడు, భార్యాభర్తలు సన్నిహితంగా ఉంటూ రికార్డ్ చేసుకున్న వీడియో కనిపించింది, వెంటనే వాట్స్ యాప్ లో తన ప్రెండ్స్ కు ఆ వీడియో సెండ్ చేశాడు, అక్కడి నుండి ఆ వీడియో పదులు, వందలు,వేలు ,లక్షల మంది చేతులు మారింది. అది కాస్త  పోర్న్  సైట్స్ లో  కూడా పోస్ట్ అయిపోయింది.

couples selfie

ఇది తెలుసుకున్న ఆ దంపతులు సిగ్గుతో చితికిపోయారు. అయినవారికి, బంధువులకు ముఖం చూపలేక విషం మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణం  మధ్యప్రదేశ్‌లో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.

పడక గది ముచ్చట్లు, మురిపాలు అక్కడి వరకే పరిమితం చేస్తే ఆ కపుల్స్  జీవితం ఇలా అర్థాంతరంగతా ముగిసేది కాదు.  బీ కేర్ ఫుల్, స్మార్ట్ ఫోన్లను మరీ ఎక్కువగా పర్సనల్ లైఫ్ లోకి రానివ్వకుండా చూసుకోండి!

CLICK: ఫంక్షన్ హాల్ లో సీసీ కెమెరా, గ్న దృశ్యాల రికార్డ్, 5లక్షల డిమాండ్!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top