వాంతి వస్తే ఎక్కువ సేపు ఆపుకోకూడదట..! ఎందుకో తెలుసా..?

కల్యాణం వచ్చినా, కక్కు (వాంతి) వచ్చినా ఆగందంటారు. కల్యాణం మాట అటుంచితే వాంతికి వస్తే మాత్రం నిజంగానే ఎక్కువ సేపు ఆపుకోకూడదట. ఎక్కడ వాంతికి వస్తే అక్కడే కక్కేయాలట. అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్‌లో ఇటీవల ఓ 16 ఏళ్ల బాలుడు వాంతిని ఆపుకోవడం మూలానే చనిపోయాడు. ఎలా అంటే అంతకు ముందు రాత్రి ఆ బాలుడు అతని సోదరుడు ఇద్దరూ ఒకే గదిలో నిద్రించాడు. కాగా అర్థరాత్రి సమయంలో ఆ బాలుడికి సడెన్‌గా వాంతికి వచ్చింది. దీంతో అతని సోదరుడు తన చేతిని మూతికి అడ్డు పెట్టి వాంతిని కొంత సేపు ఆపాడు. అనంతరం బాత్‌రూంకి వెళ్లి ఆ బాలుడు వాంతి చేసుకున్నాడు. అయితే అలా జరిగిన కొంత సేపటికే ఆ బాలుడు మృతి చెందాడు.

vomiting

ఆ బాలుడు వాంతిని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల దాంట్లోని ద్రవం నేరుగా గాలి గొట్టంలోకి వెళ్లింది. దీంతో ఆ బాలుడు ఉక్కిరి బిక్కిరై శ్వాస ఆడక చనిపోయాడు. చనిపోయిన బాలుడికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. కాబట్టి వాంతి వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. వెంటనే ఎక్కడ ఉంటే అక్కడే వాంతి చేసుకోవాలి. మనం మన పరిసరాలను సులభంగా శుభ్రం చేసుకోగలం కానీ, చనిపోతే మళ్లీ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కదా! అయితే కేవలం వాంతి మాత్రమే కాదు, ఏదైనా తినేటప్పుడు, తాగే సమయంలో పొలమారినా వారిని మనం అడ్డుకోకూడదు. దగ్గు వస్తే దగ్గు, వాంతి వస్తే వాంతి చేసుకోవానివ్వాలట. లేదంటే అది ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తుందట.

Comments

comments

Share this post

scroll to top