సినిమా స్క్రీన్లను “వెండి తెర” అనే ఎందుకు అంటారో తెలుసా? గోల్డ్, ప్లాటినం అని ఎందుకు అనరు?

మనకి “సినిమా” అనే పదం గురించి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంటా? ఎందుకంటే కూడు, గుడ్డ, ఇల్లు తో పాటు వినోదం కూడా మనకు బతుకు బండిలో ఒక భాగమే. కొంతమంది నెలకో సినిమా చూస్తారు, మరికొంత మంది వారానికో సినిమా చూస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఎలాంటి వారైనా ఎప్పుడో ఒకప్పుడు సినిమా చూడటం మాత్రం పక్కా! మనలో ఫ్యాన్ ఇజం కూడా ఎక్కువే కదా! యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు సృష్టించగల ఘనత మనది. బాహుబలి ట్రైలర్ తో అది మనం ప్రపంచానికి రుజువు చేసాము. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసాము!


ఇప్పుడంటే మనకి మల్టీప్లెక్స్ లు ఎక్కువైపోయాయి. హెచ్డీ స్క్రీన్ లు, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్ లతో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ పూర్వీకులు కాలంలో “బ్లాక్ అండ్ వైట్” సినిమాలు మాత్రమే ఉండేవని మనందరికీ తెలిసిందే. మనకు తెలిసి చలన చిత్రాలు అనేవి 19 వ శతాబ్దంలోనే మొదలయ్యాయి. అయితే థియేటర్ స్క్రీన్ ను “వెండి తెర (సిల్వర్ స్క్రీన్)” అని అంటుంటారు.


థియేటర్ స్క్రీన్ ని అసలు వెండి తెర అని ఎందుకంటారు? టీవీ ని “బుల్లి తెర” అంటారు ఎందుకంటే అది చిన్న స్క్రీన్ కాబట్టి. కానీ “థియేటర్” కి “సిల్వర్ స్క్రీన్” కి సంబంధం ఏమిటీ? గోల్డ్ కానీ, ప్లాటినం కానీ ఎందుకు అనరు?

  • “సిల్వర్ స్క్రీన్” అనే పదం 1900 సంవత్సరం నుండి వాడుకలోకి వచ్చింది
  • సినిమాలను పెద్ద స్క్రీన్ మీద ప్రాజెక్ట్ చేసేవారు. అది కేవలం “తెలుపు” రంగులో ఉండేది కాదు
  • మిర్రర్ ఫినిషింగ్ తో “సిల్వర్” కోటింగ్ ఉండేది ఆ స్క్రీన్ కు!
  • సిల్వర్ ఉండటం వాళ్ళ ఎక్కువ బ్రైట్ గా కనిపించేది, ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేది!
  • కొన్ని స్క్రీన్లకు “సిల్వర్” తో పెయింట్ వేస్తె…కొన్నిటికి మాత్రం స్క్రీన్ మీద “సిల్వర్” పొడి చల్లేవారు

ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి, థియేటర్ స్క్రీన్లలో ఎన్నో మార్పులు వచ్చినా, “సిల్వర్ స్క్రీన్ (వెండి తెర) అనే పాదం మాత్రం వాడుకలో ఉండిపోయింది!

 

Comments

comments

Share this post

scroll to top