గాయకులు పాటపాడేటప్పుడు చెవిని ఎందుకు మూసుకుంటారో తెలుసా…?

సాధారణంగా చాలా మంది గాయకులు పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే.. ఓ చేత్తో మైక్ ను, మరో చేతితో చెవిని మూసుకోవడం మనం చాలా సంధర్భాల్లో చూస్తుంటాం.!ముఖ్యంగా మెలొడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు పాట పాడడానికి, చెవిని మూయడానికి సంబంధమేంటి..? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద లాజికే ఉందట… దాని గురించి తెలియాలంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి.

తెలుగు భాషలోని అక్షరాలను నాదాత్మకాలు, శ్వాసాత్మాకాలు అని అంటారు. నాదాత్మకాలు అంటే నాభిలో పుట్టిన శబ్దం చాలా తక్కువ పరిమాణంలో గాలిని బయటికీ తీసుకురావడం, లేదా పూర్తిగా గాలిని బయటకు తీసుకురాకపోతే వాటిని నాదాత్మకాలు అంటారు. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ మొదలయిన అక్షరాలను పలికేప్పుడు గాలి ఎక్కువగా బయటకు రాదు. కాబట్టి ఇవి నాదాత్మకాలు.ఎక్కువ గాలితో బయటకు వచ్చే అక్షరాలను శ్వాసాత్మకాలంటారు. శ,ష,స,హా వీటిని పలికేప్పుడు చాలా ఫోర్స్ తో గాలి బయటకు విసర్జింపబడుతుంది.

singlikeyoumeanit

అయితే తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే తెలుగులో ఉన్న అక్షరాల్లో ఎక్కువగా ఉన్నవి నాదాత్మకాలే..నాదాత్మకాలు ఎక్కువగా ఉన్న భాష ఎప్పుడూ మధురంగా ఉంటుంది. కాబట్టి పాట మరింత మధురంగా ఉండేందుకు గాయకులు శ్వాసాత్మక అక్షరాలను కూడా నాదాత్మాకాలుగా పలకడానికి ప్రయత్నిస్తాడు. దాని కోసం శరీరంలోని భాహ్య రంద్రాలను( చెవి) మూసే ప్రయత్నం చేస్తాడు. దాని కారణంగా గాలి నాదతంత్రువుల దగ్గర ప్రకంపిచబడి పాట అతి మధురంగా బయటకు వస్తుంది. అందుకే గాయకుడు చెవిని మూసేప్రయత్నం చేస్తాడు.

Watch Song:

Comments

comments

Share this post

scroll to top