చాలా మటుకు సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ?

శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తునాటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడ్తున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆరోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే..

ఇలా శుక్రవారాలు సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 , శుక్రవారం రోజున విడుదలైన ‘గాన్ విత్ ద విండ్’ సినిమాతో విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా ‘మొఘల్ ఏ అజయ్’.

అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో అది సెంటిమెంట్ గా మారిపోయి మన దేశంలో శుక్రవారం సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి. అంతే కాదు మన దేశంలో శుక్రవారం సినిమా విడుదలను విడుదలను ఎంచుకోవడానికి మరో కారణం ఉన్నది. అదేటంటే….శుక్రవారం లక్ష్మి దేవి రోజు. ఆరోజు తమ సినిమాలని విడుదల చేస్తే లక్షీ కటాక్షం లభిస్తుందని నమ్మడం మొదలుపెట్టారు. మరొక్క కమర్షియల్ కారణం ఏంటంటే, వేరే రోజులతో పోలిస్తే శుక్రవారం రోజు స్క్రీనింగ్ రుసుము కూడా తక్కువ తీసుకుంటారు మల్టీప్లెక్స్ వారు.

Comments

comments

Share this post

One Reply to “చాలా మటుకు సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ?”

Comments are closed.

scroll to top