జబర్దస్త్ .. ఒకరిద్దరిని కాదు ఎందరో కమెడియన్స్ ను వెండితెరకు పరిచయం చేసిన షో.సినిమాఛాన్సులు లేక ఇబ్బందిపడుతున్న ఎందరికో దారి చూపిన షో..ప్రోగ్రాం పట్ల కొంత అసహనం ఉన్నప్పటికి ఐదేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న షో.. అలాంటి షోలో ఒకడే మహేశ్.. శతమానం భవతి మహేష్ అంటే ఈ జీగా గుర్తుపడతారేమో.. గతకొంతకాలంగా మహేశ్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కనిపించట్లేదు..దీనికి కారణమేంటని ఆరా తీయగా కనిపించిన రీజన్ చాలా రీజనబుల్ గా ఉంది..అదేంటో చదవండి..
శకలక శంకర్ గ్రూప్ ద్వాారా పరిచయమైన మహేశ్..తన ఆహార్యంతో,ముఖ కవళికలతోనే నవ్వుపుట్టించేయగలడు..తర్వాత కిర్రాక్ ఆర్పీ టీంలో కూడా స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు మహేశ్.మొదట్లో జబర్దస్త్ పేరుకు తగ్గట్టుగానే కింగ్ కామెడీ షో గా ఉండేది.కానీ రాను రాను డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప ఏం లేకుండాపోయాయి.వీటితో అనేక వివాదాల్లో కూడా చిక్కుకుంది..వేణు,ఆది ఇలా వరుసగా ఆ ప్రోగ్రాంలో వచ్చే కంటెస్టంట్స్ పట్ల,స్కిట్స్ పట్ల,చివరికి ప్రోగ్రామ్ పట్లే విమర్శలు వచ్చేలా తయారయింది ఈ ప్రోగ్రామ్.ఈ పరిస్థితిని ముందే గమనించిన మహేశ్ మెల్లిగా జబర్దస్త్ కు దూరం అయి సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడం మొదలెట్టాడు.శతమానం భవతి,ఉన్నది ఒకటే జిందగీ లాంటి హిట్ సినిమాలలో నటించాడు.ఇప్పుడు కూడా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నాడు.అన్నం పెట్టే చేతిని ఎవరు విడిచిపెట్టరు..కానీ కొన్ని సంధర్బాలలో తప్పదు.తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని వదలనని చెప్పిన మహేశ్ ప్రస్తుతం చేసింది కూడా అదే..కొన్నిసార్లు డబ్బు కంటే విలువలు ముఖ్యం అనిపిస్తుంది..మహేశ్ కి అదే అనిపించిందేమో గ్రేట్..