లారీలు, ట్ర‌క్కులు, ఇత‌ర వాహ‌నాల వెనుక Horn OK Please అని ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?

నిత్యం మ‌నం వివిధ సంద‌ర్భాల్లో చూసే కొన్ని ప‌దాలు, సింబ‌ల్స్‌, అక్షరాలు… ఇలా ఏవైనప్పటికీ అవి ఎలా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయో మ‌న‌కు తెలియ‌దు. కానీ వాటిని మ‌నం ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నాం. అయితే అలాంటి వాటిలో ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌దాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… Horn OK Please… వీటిని ఎక్క‌డో చూసిన‌ట్టుందే… అని ఆశ్చ‌ర్య‌పోకండి. లారీలు, ట్ర‌క్కులు, ఇత‌ర వాహ‌నాల‌పై మ‌న‌కు ఈ ప‌దాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అయితే వీటిని ముందుగా ఎవరు వాడారో, ఎందుకోసం వాడారో మ‌న‌కైతే తెలియ‌దు. కానీ… అస‌లు వీటి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవ‌న్నీ Horn OK Please అనే ప‌దాలు ఎలా వ‌చ్చాయ‌నేదానికి సూట‌య్యే ప‌లు కార‌ణాలు మాత్ర‌మే. వాటిని ఊహించే చెప్ప‌డం జ‌రుగుతుంది. అవేమిటంటే…

1. వాహనాలు ఓవ‌ర్ టేక్ చేస్తున్న‌ప్పుడు వెనుక ఉన్న వాహ‌నం క‌చ్చితంగా హార‌న్ మోగించాలి అనే విష‌యాన్ని గుర్తు చేయ‌డం కోసమే ఇలా పెట్టి ఉంటారు.

2. వెనుక ఉన్న వాహ‌నాలు హార‌న్ మోగిస్తే దాన్ని విన్న ముందు వాహ‌న డ్రైవ‌ర్ OK అని భావించి వెనుక డ్రైవ‌ర్‌కు ఓవ‌ర్ టేక్ చేసేందుకు దారి వ‌దులుతాడు. ఈ క్ర‌మంలో వెనుక ఉన్న డ్రైవ‌ర్‌కు OK అని చెప్పేందుకు ముందు ఉన్న డ్రైవ‌ర్ లైట్ల‌ను వెలిగిస్తాడు. అందువ‌ల్లే Horn OK Please అనే ప‌దాలు ట్ర‌క్కుల వెనుక పెట్టి ఉంటార‌ని తెలుస్తుంది.

3. రెండో ప్ర‌పంచ యుద్ధం అప్పుడు వాహ‌నాల‌ను కిరోసిన్‌తో న‌డిపేవారట‌. దాన్ని సింబాలిక్‌గా చూపేందుకు కొన్ని వాహ‌నాల‌కు వెనుక ఆన్ కిరోసిన్ (On Kerosene) అని రాసేవార‌ట‌. ఇలా సూచిస్తే వాహ‌నాలు ఢీకొనే, ప్ర‌మాదం జ‌రిగే అవకాశం త‌క్కువ‌గా ఉండేద‌ట‌. అయితే అదే OK గా మారింద‌ట‌. అందుకే ఆ ప‌దం Horn Please మ‌ధ్యలో వ‌చ్చింద‌ట‌.

4. అప్ప‌ట్లో టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్ OK అనే డిట‌ర్జెంట్‌ను అమ్మేద‌ట‌. అయితే ఆ ప్రోడ‌క్ట్‌ను ప్ర‌మోట్ చేసుకునేందుకు ట్ర‌క్కుల వెనుక అలా OK అని రాయించేవార‌ట‌. ఈ క్ర‌మంలోనే Horn Please ల మ‌ధ్య‌లో అది వ‌చ్చి చేరింద‌ని చెబుతారు.

5. వాహ‌నాల వెనుక Horn OK Please అనే ప‌దాలు చదివితే వెనుక ఉన్న వాహ‌నాలు సేఫ్ దూరంలోనే ఉన్న‌ట్టు అర్థ‌మ‌ట‌. అందుకే అలా రాయించ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

6. Horn OTK (Overtake) అనే ప‌దాలు Horn OK Please గా మారాయ‌ట‌. Horn OTK (Overtake) అంటే వెనుక ఉన్న వాహ‌నం ముందు ఉన్న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేసేట‌ప్పుడు క‌చ్చితంగా హార‌న్ మోగించాలి అని అర్థం వ‌స్తుంది. అందుకే ఆ ప‌దాలు అలా మారిన‌ట్టు తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top