వర్షం పడగానే కప్పలు బైటికి వస్తాయి ఎందుకు??

వర్షం పడగానే బెక బెక అనుకుంటూ కప్పలు రావడం గమనించారా.. అప్ప‌టి వ‌ర‌కు కంటికి క‌నిపించ‌ని క‌ప్పలు..వ‌ర్షం ప‌డగానే మ‌న‌కు క‌నిపిస్తుంటాయి.! ఇక గ్రామాల్లోఅయితే వ‌ర్షం ప‌డ్డ రాత్రి క‌ప్ప‌ల బెక‌బెక చ‌ప్పుళ్ళ‌తోనే స‌రిపోతుంది.! అస‌లు వ‌ర్షానికి క‌ప్ప‌ల‌కు మ‌ద్య ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!

క‌ప్ప వర్షాలు ప‌డ‌గానే బ‌య‌టికి రావ‌డానికి 4 ప్ర‌ధాన కార‌ణాలున్నాయి.

1) వాతావ‌ర‌ణం.
స‌హ‌జంగా క‌ప్ప ఎక్క‌వ ఉష్ణోగ్ర‌త‌ను త‌ట్టుకోలేదు. దాని చ‌ర్మంపై ఓ ర‌క‌మైన జిగురు ను క‌ల్గి ఉంటుంది.వేస‌వి కాలంలో… ఇదే బ‌య‌టి వాత‌వ‌ర‌ణం నుండి క‌ప్ప‌ను ర‌క్షిస్తుంది. ఇక వ‌ర్షం ప‌డిందంటే..క‌ప్ప‌కు పండ‌గే.! వాత‌వ‌ర‌ణంలోని తేమ‌ను ఆస్వాదించ‌డానికి అప్ప‌టి వ‌ర‌కు నేల‌లోని బొరియ‌ల్లో ఉండే క‌ప్ప‌లు ఒక్క‌సారిగా బ‌య‌టికి వ‌చ్చేస్తాయి.

2) క‌ల‌యిక‌.
ఇలా వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించ‌డానికి బ‌య‌టికొచ్చిన క‌ప్ప‌లు…త‌మ పార్ట్ న‌ర్ ను ఎంచుకొని త‌మ సంతానోత్ప‌త్తిని పెంచుకుంటాయి. వ‌ర్షాకాలం రాత్రులు వీటికి అనువైన స‌మయంతో….అప్పుడే పుట్టిన క‌ప్ప పిల్ల‌లు సైతం గెంతులేస్తూ శ‌బ్దం చేయ‌డం విశేషం.!

3) ఆహార వేట‌.
వర్షం ప‌డిన త‌ర్వాతే క‌ప్ప‌లకు ఆహార సేక‌ర‌ణ ఈజీ అవుతుంది. వ‌ర్షం కార‌ణంగా వాన‌పాములు, ఇత‌ర కీట‌కాలు బ‌య‌టికి వ‌స్తాయి కాబ‌ట్టి వాటిని వేటాడ‌డం తింటాయి.!

4) చ‌ల్ల‌బ‌ర్చుకోవ‌డం.
ఎండాకాలంలో…క‌ప్పలు నేల‌లోకి బొరియ‌లు తీసి..అందులో ఉంటాయి. ఈ స్థితి నుండి బ‌య‌టికి వ‌చ్చిన క‌ప్పులు వాటి శ‌రీర వేడిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోవ‌డం కోసం..వ‌ర్షం ప‌డ‌గానే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. క‌ప్ప‌ల‌కు ఉండే విశిష్ట ల‌క్ష‌ణం సుప్తావ‌స్థ‌.!దీని కార‌ణంగానే ఎండాకామంతా….ఎటువంటి శ్ర‌మ చేయ‌కుండా క‌ప్పులు కామ్ గా బొరియ‌ల్లో ప‌డుకుండిపోతాయి.!!

 

Comments

comments

Share this post

scroll to top