క్యాప్సుల్స్ కి రెండు విభిన్న కలర్స్ ఎందుకుంటాయో తెలుసా? దాని వెనుక పెద్ద లెక్క ఉంది.

జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి….ఇలా రోగం ఏదైనా సమాధానం మాత్రం ట్లాబ్లెట్సే.. ఇక కొంత మందైతే మిని మెడికల్ షాప్ లో ఉన్నన్ని మెడిసిన్స్ ను తమ వెంట క్యారీ చేస్తుంటారు.  రోగాలు-ట్యాబ్లెట్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి…ఓ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే….. క్యాప్సుల్స్  ఎందుకు రెండు విభిన్న కలర్ లో ఉంటాయి.

మొదటగా క్యాప్సుల్స్ పనితీరు గురించి తెల్సుకుందాం:

1847 లో లండన్ కు చెందిన జేమ్స్ మర్డోక్…. క్యాపుల్స్ ను కనుగొన్నాడు.  రెండు నిలువు గొట్టాలను కలిపి ఒకటిగా ఉండేదే  క్యాపుల్స్ … వ్యాధి నివారణ కోసం  వీటిని తీసుకున్నప్పుడు అవి శరీరంలోకి వెళ్లి ..పూర్తిగా కరిగిపోయి, లోపలున్న అసలు మెడిసిన్  గుర్తించిన వ్యాధికారకాలపై పోరాటం చేసి రోగాన్ని తగ్గిస్తాయి. గాలితో చర్యనొంది త్వరగా ఆవిరయ్యి, తన గుణాన్ని కోల్పోయే తత్త్వం క్యాప్సుల్స్ కు ఉంటుంది. అందుకే క్యాప్సుల్స్ లోపల అసలైన మెడిసిన్ ఉండి..దాని మీద కడుపులోకి వెళ్లగానే కరిగిపోయే గుణాన్ని కల్గిన ప్లాస్టిక్ కోట్ గల గొట్టాలుంటాయి.

4noxpv54kbk3s5phxop0

క్యాప్సుల్స్ రెండు విభిన్న కలర్స్ లో ఉండడానికి గల కారణాలు:

  • క్యాప్సుల్స్ లో రెండు నిలువు గొట్టాలుంటాయి. ఒకటి పెద్దదిగా, మరోటి చిన్నదిగా ఉంటాయి. ఈ రెండూ వేరు వేరు రంగుల్లో ఉంటాయి. ఒకదాంట్లో మెడిసిన్ ను ఫిల్ చేస్తారు. రెండో దానికి దానికి క్యాప్ లాగా తొడుగుతారు.
  • ఏందులో మెడిసిన్ నింపాలి, ఏది క్యాప్ గా తొడగాలో గుర్తించడానికి ఇలా క్యాప్సుల్స్ ను డిఫరెంట్ కలర్స్ లో ఉండేలా చూస్తారు.
  • అంతేకాకుండా….చిన్న పిల్లలు సాధారణంగా ట్యాబ్లెట్స్ మింగడానికి ఇష్టపడరు…అలాంటి వారికి రంగు రంగుల్లో ఉన్న క్యాప్సుల్స్ ఇస్తే..వెంటనే వేసుకుంటారు. అందుకోసం క్యాప్సుల్స్ తయారీలో డిఫరెంట్ కలర్స్ ను మెయింటేన్ చేస్తారు.
  • డిఫరెంట్ కలర్స్ ను బట్టి…. ఈ క్యాప్సుల్స్ సదరు కంపెనీవి అని గుర్తు పట్టేలా ఉండి, వారి బిజినెస్ ను పెంచుకునే నిమిత్తం క్యాప్సుల్స్ తయారీకి తమదైన కలర్స్ ను ఎంచుకొని తయారు చేస్తారు.

( ఇలాంటి ఆసక్తికర విషయాలు డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి)

 

Comments

comments

Share this post

scroll to top