“ఆలీ” లేకుండా “పవన్ కళ్యాణ్” సినిమా చేయరు..మరి “అజ్ఞ్యాతవాసి” లో “ఆలీ ఎందుకు లేరు..?

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”. ఆయనకీ అత్యంత సన్నిహితులైన త్రివిక్రమ్ గారితో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు పవన్. జల్సా, అత్తారింటికి దారేది ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు అభిమానులంతా “అజ్ఞ్యాతవాసి” కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఆడియో కూడా అందరిని ఆకట్టుకుంది.

ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే..! పవన్ కి స్నేహితులు అంటే మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత అలీ గుర్తుకు వస్తారు. పవన్,అలీ ల స్నేహం ఇప్పటిది కాదు. పవన్ హిట్ సినిమాలు అన్నింటిలోనూ దాదాపుగా అలీ ఉన్నాడు. పవన్ జనసేన ఆఫీస్ ప్రారంభించినప్పుడు కూడా హాజరు అయినా ముఖ్యమైన వ్యక్తి అలీ. కాటమరాయుడు ఆడియో రిలీజ్ సమయంలో అలీ,పవన్ ఎంత సరదాగా ఉన్నారో ప్రతి అభిమాని చూసే ఉంటారు. అలాంటి అలీ అజ్ఞాతవాసి టీజర్ లోగాని,ఆడియో వేడుకలో గాని ఎక్కడ కనపడలేదు. అలాగే ఎవరు అలీ గురించి కూడా మాట్లాడలేదు.

ఆలీ అజ్ఞ్యాతవాసి లో నటించట్లేదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. కాల్ షీట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోయాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. రావు రమేష్, మురళి శర్మ తో ఈ సినిమాలో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అర్ధమైంది. ఇక కీర్తి సురేష్, అను ఏమనుల్ తెరపై ఎలా సందడి చేయనున్నారో చూడాలి. అయితే సినిమాలో నటించిన వారందరిని టీజర్ లో చూపించలేము కదా అని కొంచెం ఘాటుగానే సమాధానము చెప్పింది చిత్ర యూనిట్. ఏది ఏమైనా పవన్ 25 వ సినిమా అజ్ఞాతవాసి సినిమాలో అలీ లేకపోతే మాత్రం బాధాకరమైన విషయమే.

Comments

comments

Share this post

scroll to top