“మల్లీశ్వరి” హీరోయిన్ “శాంభవి” కి ఏమైందో తెలుసా..? ఆమె స్థానంలో “ఐశ్వర్య” రావడానికి కారణం ఇదే..!

వెండితెర కన్నా బుల్లితెర నటులు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటారు.సినిమా మూడు గంటలు చూసొచ్చాక దాని సంగతి మర్చిపోతారు కానీ..సీరియళ్లు మాత్రం అలా కాదు ఏళ్లకేళ్లు వస్తుంటాయి..అందులోని నటీనటులు కూడా సొంతపేరుతో కాకుండా ఆ క్యారెక్టర్ పేరుతోనే గుర్తింపు పొందుతారు.వారు బయటెక్కడైనా కనపడితే అభిమానులు అవే పేర్లతో పిలుస్తుంటారు కూడా..అసలు వారి సొంత పేర్లేంటో కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు..అలాంటి నటీనటులు సడన్ గా సీరియళ్లో కనిపించడం మానేస్తే..వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకుంటే ..ఇన్ని రోజులు చూసిన వారికి ఏమైందో ఎందుకు తీసేసారో అనే ఆలోచన వస్తుంది..కొందరికైతే వారిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది.అంతలా కనెక్ట్ అవుతారు..ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మళ్లీశ్వరి సీరియల్ నటి శాంభవి కూడా ఇప్పుడు సీరియల్లో కనిపించట్లేదు..ఆమె ప్లేస్ లో ఐశ్వర్య అనే కొత్త నటిని తీసుకున్నారు.

watch video here:

“మళ్లీశ్వరి” స్టార్ మా లో ప్రసారం అవుతుంది.ఇప్పటికి రెండు వందల నలభై ఎపిసోడ్స్ వరకు కొనసాగింది.ఆ సీరియల్లో మళ్లీశ్వరిగా శాంభవి అనే నటి మొదటి నుండి కనిపిస్తుంది.తండ్రి లేని పిల్ల,తల్లి ,అక్క ,తమ్ముడు కుటుంబ భారాన్ని తల్లితో పాటు మోస్తున్న కూతురు క్యారెక్టర్ మళ్లీశ్వరిది..మగరాయుడులా కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో ఒక సంపన్నుడు వచ్చి తన కొడుకుని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబ సమస్యలు తీరుస్తా అంటాడు.ఇంతకీ ఆ కొడుకు ఉన్నది జైలులో..కొద్ది రోజుల్లో ఉరిశిక్ష పడబోతున్న అతన్నిచేసుకోవడానికి ఒప్పుకుంటుంది మళ్లీశ్వరి.ఆ తర్వాత రాణా ఎలా బయటికి వచ్చాడు.మళ్లీశ్వరి ఏం చేసింది..ఇదంతా స్టోరీ గత ఆరేడు నెలలుగా ఆసక్తికరంగా సాగుతుంది.ప్రేక్షకులు మళ్లీశ్వరి క్యారెక్టర్లోని శాంభవికి కనెక్ట్ అయిపోయారు.సడన్ గా ఇప్పుడు శాంభవి బదులు ఐశ్వర్య అనే కొత్తామె నటిస్తుంది.

శాంభవిని సీరియల్ నుండి తీసేయడానకి కారణం ఏంటంటే సీరియల్ షూటింగ్ టైంలో జరిగిన చిన్న యాక్సిడెంట్ కారణంగా శాంభవికి కాలుకు గాయం అయిందంట.మేజర్  ఇన్సిడెంట్ అవ్వడంతో శాంభవిని సీరియల్ నుండి తప్పించారు.ఆ గాయం మానడానికి రెండు మూడు నెలలు పడుతుంది..ఆ తర్వాత శాంభవిని తీసుకుంటారా అంటే అదీ అనుమానమే..కానీ ప్రేక్షకులు మాత్రం శాంభవే మళ్లీశ్వరిగా రావాలని కోరుకుంటున్నారు.చూడాలి ఏం జరుగుతుందో..

Comments

comments

Share this post

scroll to top