కార్లు, ఇతర 4 వీలర్స్‌లో స్టీరింగ్ మధ్యలో ఎందుకు ఉండదు?

ఒకప్పుడు కారంటే కేవలం ధనికులకు మాత్రమే ఉండే విలాస వస్తువుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు అలా కాదు. ఎగువ మధ్యతరగతి వారు, ఆ మాటకొస్తే కొంత మంది మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయినా అలాంటి వీల్స్ కలిగిన వేరే ఏ వాహనమైనా అందులో స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపు మాత్రమే ఎందుకుంటుంది? మధ్యలో ఎందుకు ఉండదు? ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌతాఫ్రికా వంటి కేవలం కొన్ని దేశాల్లోనే కార్లకు స్టీరింగ్ కుడి వైపుకు ఉంటుంది. మిగతా అన్ని దేశాల్లోనూ స్టీరింగ్ ఎడమ వైపుకు ఉంటుంది. అయితే కుడి లేదా ఎడమ ఏదైనా పెద్ద తేడా ఏం లేదు. ఎటు వైపు ఉండి నడిపినా సౌకర్యవంతంగానే ఉంటుంది.
EpilepsyDrivingNYC_night_high_speed_car_driving-hd
  • కాగా కొన్ని దేశాల్లో ఒకలా, ఇంకొన్ని దేశాల్లో మరొకలా వాహనాల స్టీరింగ్‌లు ఎందుకుంటాయంటే అందుకు అక్కడి ట్రాఫిక్ రూల్సే కారణం. ఈ క్రమంలోనే ఎడమ వైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై కుడివైపుకు, కుడివైపు స్టీరింగ్ కలిగిన వారు రోడ్డుపై ఎడమవైపుకు వెళతారు.
  • కానీ వాహనాల స్టీరింగ్ మాత్రం ఏదో ఒక వైపుకు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఉండదు.
  • వాహనం మధ్యలో స్టీరింగ్ ఉంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి రోడ్డును అన్ని వైపులా క్లియర్‌గా చూడలేడు.
  • దీనికి తోడు స్టీరింగ్ మధ్యలో ఉంటే వాహనం ముందు భాగంలో కేవలం ఒకరు మాత్రమే కూర్చునేందుకు వీలు కలుగుతుంది. దీంతో మొత్తంగా కారులో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుంది.
  • వాహనంలో కుడి లేదా ఎడమ వైపుల్లో ఏదో ఒక సైడ్ మాత్రమే స్టీరింగ్ ఉంటే వాహనాన్ని సులభంగా యు టర్న్ చేయవచ్చు.
Driving a car

Driving a car

Comments

comments

Share this post

scroll to top