తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను పక్కకు పెట్టి P.V సింధు ను చేయాలనే వాదనను మీరు ఏకీభవిస్తున్నారా?

నిన్న  ఒలంపిక్స్  బ్యాడ్మింటన్ సెమీస్ లో  జపాన్ క్రీడాకారిణి  ఒకుహారా పై P.V సింధు గెల్చినప్పటి నుండి ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. స్వర్ణం తో రావాలని ఆశీర్వాదాలు ప్రార్థనలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవన్నీ అటుంచితే…సోషల్ మీడియాలో మరో అంశం కూడా తెరమీదకు వచ్చింది.ప్రస్తుతం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానిమా మీర్జాను పక్కకు పెట్టి  P.V సింధుకు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలనే  డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. దీనికి చాలా మంది వివిధ కారణాలు కూడా చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర  బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న  సానియా మీర్జా మీద ప్రభుత్వ కార్యక్రమాల్లో సరిగ్గా  పాల్గొనట్లేదని  అనేక అరోపణలు వినిపించాయి. దానికి తోడు నిన్న ఒలంపిక్స్ లో పి.వి సింధు అద్భుత ప్రదర్శనను చూసినాక చాలా మంది…ఈ అభిప్రాయాన్నేే వెలిబుచ్చారు .

Sania-Mirza-PTI-horz

సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని చెబుతున్న వారు చూపుతున్న కారణాలు:

  • తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి డుమ్మా కొట్టి, పెటా కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం.
  • జన్మత: ముంబై వాసి కావడం.
  • పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో వివాహం
  • ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమంలో కూడా అంత యాక్టివ్ గా పాల్గొనకపోవడం.
  • ఆటకంటే కూడా యాడ్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుందనే ప్రచారం.

ఇదే సమయంలో P.V సింధును తెలంగాణ రాష్ట్ర  బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే వారు చెబుతున్న కారణాలు.

  • తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాలపండుగ నాడు బోణమెత్తడం.
  • పక్కా హైద్రాబాదీ అవ్వడం.
  • అన్నింటికి మించి పతకం కోసం ఎదురుచూస్తున్న యావత్ భారతదేశానికి కాంస్యాన్ని మించిన పతకం ఖాయం చేయడం.
  • దేశమంతా హైద్రాబాద్ పేరును మార్మోగేలా చేయండం.
  • ఇతర వ్యాపకాలు లేకపోవడం.

13957580_1071992319505219_698052318_n

 

Comments

comments

Share this post

scroll to top