డ్రగ్స్ కేసు విచారణ: “ముమైత్” బిగ్ బాస్ షో వదిలేలుతుంటే ఏమైందో తెలుసా? ఆమెతో పాటు వెళ్ళింది ఎవరు?

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నముమైత్‌ఖాన్ గురువారం సిట్ విచారణకు హాజరైంది. సిట్ బృందంలోని మహిళా అధికారులు ఆమెను విచారిస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉంది. ఆమెకు విచారణ కోసం మినహాయింపు ఇచ్చారు. విచారణ నిమిత్తం పుణె నుంచి హైద్రాబాద్‌కు వచ్చింది.  అయితే ఆమెతోపాటు పాటు బిగ్ బాస్ షో ప్రతినిధులు కూడా సిట్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయ సమీపంలోనే ఉండి కదలికలను గమనిస్తున్నారు. 70 రోజుల పాటు పార్టిస్పెంట్ బాధ్యత తమదేనని షో నిర్వాహులు చెబుతున్నారు. బయటికెళ్లే వెసులుబాటు ఆమెకు లేకపోవడంతో ఆమెతో పాటు వచ్చినట్లు వారు తెలిపారు. పుణె వెళ్లే వరకు ముమైత్‌కు ఫోన్ ఇవ్వకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ షో నుంచి ఆమె అనుమతి మాత్రమే తీసుకున్నారని, షో నుంచి తప్పుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. సాయంత్రం విచారణ ముగిసిన వెంటనే మళ్లీ పుణె బయల్దేరనున్నారు.

బిగ్ బాస్ సరికొత్త ప్రోమోలో ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లే వీడియో చూడొచ్చు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top