జ్యోతిలక్ష్మి ఆడియో లాంచ్ కి “కెల్విన్” వచ్చాడని వార్త..! నిజానికి అతనెవరో తెలుసా?

డ్రగ్స్..కొద్ది రోజులుగా ఇదే పదం అందరి నోళ్లల్లో నానుతుంది.స్కూల్ పిల్లల డ్రగ్స్ వ్యవహారం టాలివుడ్ వైపు మళ్లింది.అక్కడి నుండి పూరి,కెల్విన్ ల మధ్య సంభదాలున్నాయని వార్తలు..కెల్విన్ జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ కి కెల్విన్ వచ్చాడని ఒక  ఫోటో మీడియా పదే పదే చూపించింది.కానీ అది కెల్విన్ కాదు తాను అంటున్నారు నాగబాబు..ఇంతకీ ఈ నాగబాబు ఎవరో చూడండి.

ఆ ఫోటో కెల్విన్ ది కాదు నాది అని బెంగ‌ళూరుకి చెందిన నాగ‌బాబు అంటున్నారు.ఈ  విష‌యాన్నిఅతనే మీడియా ముందుకి వ‌చ్చి చెప్పాడు. ఆ ఫోటో త‌న‌దే అనే ప్రూఫ్ కోసం మెయిల్ ఐడీ, బ్యాంక్ ఖాతా, ఫేస్ బుక్ త‌దిత‌ర ఖాతాల‌ను కూడా చూపించాడ‌ట‌. మీడియా అత్యుత్సాహం వ‌ల‌న నాకు చాలా న‌ష్టం జరిగింద‌ని ఆ వ్య‌క్తి వాపోతున్నాడు.

కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్ర‌గ్స్ మాఫియా వ‌ణికిస్తుంది. దాదాపు 12 మందిని డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అనుమానితులుగా గుర్తించిన సిట్ ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రిగా విచార‌ణ జ‌రుపుతుంది. అయితే ఈ రాకెట్ వెనుక ఉన్న అస‌లు సూత్ర‌ధారి కెల్విన్ అని, పూరీ జ‌గ‌న్నాథ్ కి అత‌నికి చాలా సంబంధాలు ఉన్నాయ‌ని కొద్ది రోజులుగా ఎల‌క్ట్రానిక్ మీడియా జోరుగా ప్ర‌చారం చేస్తుంది. అయితే కెల్విన్ అనే వ్యక్తి జ్యోతి ల‌క్ష్మీ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంకి కూడా హాజ‌ర‌య్యాడ‌ని ఓ ఫోటోని స‌ర్కిల్ చేస్తూ ప‌దే ప‌దే చూపిస్తున్నారు. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా త‌న సోష‌ల్ మీడియా పేజ్ లో ఫోటోలో చూపించిన వ్య‌క్తి నాగ‌బాబు కాదంటూ గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల‌ని కొట్టి పారేశాడు.

 

Comments

comments

Share this post

scroll to top