ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ సరసన “శ్రీదేవి” పాత్రలో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా.?

నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న ఈ సినిమాలో మిగతా పాత్రలకు నటుల ఎంపిక జరుగుతుంది.నిజజీవిత పాత్రలను ఎవరు పోషిస్తారనేది సర్వాత్రా ఆసక్తికరంగా మారింది..ఈ సినిమాలో కొన్ని పాత్రలకు కొందరు నటులను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి..వాటిల్లో ఒకటి దీపిక పదుకునే ఈ సినిమాలో నటిస్తుందన్నది..అయితే దీపిక పోషించే పాత్ర ఏంటో తెలుసా…

ఎన్టీఆర్ సినీ లైఫ్ లో అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి ఎన్నో  సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ సినిమాలో శ్రీదేవి రోల్ కూడా ఉంది.ఆ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే ని చిత్ర బృందం సంప్రదించింది. ఆమె నటించడానికి ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ సినిమా తొలి షెడ్యూల్ రామకృష్ణ సినీ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో రాజకీయ,సినీ ప్రముఖుల మధ్య ప్రారంభమైంది. దాన వీర సూర కర్ణ సినిమాలోని కీలకమైన సీన్ ని ఇక్కడ తెరకెక్కించారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత సినిమా యూనిట్ అంతా ఎన్టీఆర్ స్వస్ధలం నిమ్మకూరుకి వెళ్లనున్నారు. అక్కడ ఎన్టీఆర్ యవ్వనంలో జరిగిన సంఘటనలను షూట్ చేయనున్నారు. ఓ వైపు షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతూనే,మరోవైపు ఈ సినిమాలో నటించేందుకు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే దీపికాను ,ఇతర నటులను సంప్రదిస్తుంది చిత్రబృందం..

Deepika Padukone

ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్థన్‌ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరెడ్డికి ఏ పాత్ర ఇస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Comments

comments

Share this post

scroll to top