సౌంద‌ర్య సినిమాలో చూపించిన తెల్ల‌పాము శ్వేత‌నాగు దొరికింది.. ఎక్క‌డో తెలుసా..?

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సౌంద‌ర్య‌, అబ్బాస్‌లు న‌టించిన శ్వేత‌నాగు సినిమా తెలుసు క‌దా. అందులో తెల్ల‌గా ఉండే పాము శాపానికి సౌంద‌ర్య గుర‌వుతుంది. చివ‌ర‌కు ఆ పాము ఆమెను కాటు వేస్తుంది. దీంతో నాగ‌దేవ‌త‌ను వేడుకుంటే ఆమె తిరిగి బ‌తుకుతుంది. అయితే నిజంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు బ‌య‌ట జ‌రుగుతాయో లేదో చెప్ప‌లేం కానీ, ఆ సినిమాలో చూపించిన విధంగా ఓ తెల్ల‌ని శ్వేత నాగు మాత్రం నిజంగా దొరికేసింది. అది త‌మిళ‌నాడులో..! దీంతో ఆ పామును చూసేందుకు ఇప్పుడ‌క్కిడికి చాలా మంది వెళ్తున్నారు. కొంద‌రైతే పూజ‌లు కూడా చేస్తున్నార‌ట తెలుసా..!

త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా పూండి అట‌వీ ప్రాంతంలో ప‌లువురు పాములు ప‌ట్టేవాళ్ల‌కు అరుదైన జాతికి చెందిన శ్వేత నాగు ఒక‌టి దొరికింది. దీంతో మొద‌ట దాన్ని చూసిన వారు ఆశ్చ‌ర్యపోయారు. అయినా తేరుకుని వెంట‌నే వైల్డ్‌లైఫ్ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ క్ర‌మంలో అధికారులు ఆ శ్వేత‌నాగును తీసుకుని వెళ్లిపోయారు. వారు దాన్ని చెన్నై స‌మీపంలో ఉన్న గిండీ నేష‌న‌ల్ పార్కులో వ‌దిలారు. దీంతో ఆ పామును చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డుతున్నార‌ట‌.

కొంద‌రైతే సాక్షాత్తూ నాగ‌దేవ‌తే వ‌చ్చింద‌ని న‌మ్మి ఆ శ్వేత‌నాగుకు పూజ‌లు కూడా చేస్తున్నార‌ట‌. అయితే ఆ శ్వేత‌నాగును చూసిన పలువురు సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే… పాములకు కొన్ని సార్లు చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌స్తాయ‌ట‌. దీంతో అవి రంగులోకి మారుతాయ‌ట‌. అలా ఆ నాగుపాము తెలుపు రంగులోకి మారి ఉంటుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక మ‌రికొంద‌రు సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారంటే.. ప‌లు ర‌కాల జాతుల‌కు చెందిన నాగుపాములు ఇలాగే ప్ర‌కృతికి త‌గిన విధంగా రంగులను మారుస్తాయ‌ట‌. శ‌త్రువుల నుంచి త‌ప్పించుకుంటానికి, వారిని ఏమార్చ‌డానికి పాములు ఇలా తెలుపు రంగులోకి వాటంత‌ట అవే మారుతాయ‌ట‌. ఇలా ప‌లువురు సైంటిస్టులు త‌మ‌కు తెలిసిన విధంగా స్పందిస్తున్నారు. అయితేనేం జ‌నాలు మాత్రం ఆ తెల్ల‌ని శ్వేత‌నాగును చూడ‌డం మాన‌డం లేదు. మ‌రి దాన్ని చూడాలంటే మీరు కూడా అక్క‌డికి వెళ్లండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top