సావిత్రి చనిపోయాక జెమిని గణేశన్ ఏమయ్యాడు? ఎలా చనిపోయాడు తెలుసా..?

మహానటి సినిమాతో  ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది సావిత్రి టాపిక్కే.ఒక నటి అనుకునేవారికి ఒక చరిత్ర అంటూ పరిచయం చేసిన సినిమా. అంత పెద్ద నటి ,సూపర్ స్టార్ వివాహం విఫలమై తన జీవితాన్ని చిదిమేసుకోవడమే ఇప్పుడు అందరిని తొలిచేస్తున్న విషయం.ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినియే సావిత్రిని మోసం చేశాడు అని అందరి అభిప్రాయము. సావిత్రిని అభిమానించేవారికి,తెలుగు సినిమా ప్రేక్షకులకు సావిత్రి జీవితం వరకూ జెమిని పెద్ద విలన్.మరి అంతటి విలన్ సావిత్రి చనిపోయిన తర్వాత ఏమయ్యాడు..జెమిని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు..

జెమిని గణేశన్ ..జెమిని స్టూడియోస్ లో పనిచేయడంతో రామస్వామి గణేశన్ కి ఈ పేరు వచ్చింది.తమిళ నాడులోని పుదుక్కోటైకి చెందిన రామస్వామి సైన్సుగ్యాడ్యుయేట్..కొన్నాళ్లు లెక్చరర్ గా పనిచేశాడు.తమిళ సినిమాల్లో,కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించాడు..తమిళంలో పెద్ద హీరో,స్పోర్ట్స్ పర్సన్ కూడా..క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాడు..రుద్రవీణలో చిరంజీవి తండ్రిగా నటించింది ఈ జెమినినే. జెమిని స్టూడియోకి వచ్చినప్పుడే సావిత్రి కి జెమినితో పరిచయం.తర్వాత ఇద్దరూ  మనం పోల్ మాంగల్యం అనే సినిమాలో  నటించారు.వీరిద్దరి మనసులు అక్కడే కలిసాయి..అయితే అప్పటికే జెమినికి అలమేలుతో వివాహం అయి ఇద్దరు పిల్లలున్నారు..పుష్పవల్లి అనే నటితో వివాహేతర సంభందంలో ఉన్నాడు.. పుష్పవల్లి,జెమినిలకు పుట్టిన సంతానమే బాలివుడ్ నటి రేఖ..

మనం పోల్ మాంగల్యం సినిమా తర్వాత సావిత్రి,జెమిని గుడిలో ఎవరికి తెలియకుండా వివాహం చేసుకున్నారు..సావిత్రి ,జెమినిల వివాహం అనూహ్య పరిస్థితుల్లో బయటపడింది..అప్పట్లో లక్స్ సోప్ కి సంభందించిన యాడ్ అగ్రిమెంట్లో సైన్ చేసేటప్పుడు సావిత్రి గణేశన్ అని చేయడంతో వారి వివాహం విషయం బయటపడింది..వీరికి విజయ చాముండేశ్వరి,సతీష్ అనే ఇద్దరు సంతానం..సావిత్రి,జెమినిల బంధం తర్వాత కూడా జెమిని ఇతర స్త్రీలతో సంభందం పెట్టుకోవడాన్ని సావిత్రి భరించలేక దూరం పెట్టింది.దాంతో వారి మధ్య దూరం పెరిగింది.అప్పటివరకు సరదాగా అలవాటు చేసుకున్న మద్యం..అప్పటినుండి వ్యసనంగా మారింది.సావిత్రికి జెమినియే మందు అలవాటు చేశాడనేదాంట్లో నిజం లేదు..అంతేకాదు సావిత్రి కోమాలోకి వెళ్లిన తర్వాత తనని చూసుకున్నది జెమినియే.దానదర్మాలు చేసి సావిత్రి ఆస్తులు పోగొట్టుకోగా వాటిల్లో కొన్ని ఆస్తులైనా పిల్లల పేర వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.పిల్లల్ని చూసుకున్నాడు.

జెమిని తన 79వ ఏట తన సెక్రటరీ జూలియానాని వివాహం చేసుకున్నాడు..జూలియానా జెమినిని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించింది.నాలుగు పెళ్లిల్లు చేసుకున్న జెమిని చివరికి దుర్బర జీవితం గడిపి తనువు చాలించాడు.జెమిని కి ఉన్న మరొక పేరు ఏంటో తెలుసా కాదల్ మన్నన్ అంటే అర్దం ప్రేమకు రారాజు..

Comments

comments

Share this post

scroll to top