అక్క‌డి కార్మికులు త‌లా కొంత డ‌బ్బు జ‌మా చేసి….సొంతంగా హాస్పిట‌ల్ క‌ట్టించుకున్నారు.!

పేద వాడికి ఉచితంగా వైద్యం అందించ‌డం అంటే కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కు ప్రాణానికొస్తుంది. దీంతో వారు అస్స‌లు ఆ ప‌ని చేయ‌రు గాక చేయ‌రు. ఒక వేళ ఎవ‌రైనా అలా ఉచితంగా వైద్యం చేయ‌మ‌ని వ‌స్తే త‌న్ని త‌రిమేస్తారు, కానీ కొంత కూడా మాన‌వ‌త్వం చూపించ‌రు. స‌రిగ్గా ఇలా జ‌రుగుతుంది క‌నుక‌నే అక్క‌డి కార్మికులు అంతా క‌లిసి ఏక‌మ‌య్యారు. త‌మ‌కు తాముగా సొంతంగా, త‌మ డ‌బ్బుతో ఓ హాస్పిట‌ల్‌ను క‌ట్టించుకున్నారు. అది ఇప్ప‌టికీ ఎంతో మంది కార్మికుల‌కు ఉచితంగా సేవ‌ల‌ను అందిస్తోంది. ఆ హాస్పిట‌ల్ పేరు షాహీద్ హాస్పిట‌ల్‌.

అది చ‌త్తీస్‌గ‌డ్ ప్రాంతం. 1983వ సంవ‌త్స‌రం. ఆ స‌మ‌యంలో అక్క‌డ ప‌నిచేస్తున్న కార్మికుల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే ప‌రిస్థితి దారుణంగా ఉండేది. వైద్యం చేయించుకుందామంటే కార్పొరేట్ హాస్పిట‌ల్‌కే వెళ్లాలి. దీంతో చేతిలో డ‌బ్బులేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత ప‌డేవారు. అయితే దీన్ని చూసి కార్మికులు త‌ట్టుకోలేక‌పోయారు. దీంతో వారంద‌రూ ఏక‌మై చ‌త్తీస్‌గ‌డ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ (సీఎంఎస్ఎస్‌) అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి శంక‌ర్ గుహ నియోగి అనే కార్మిక నాయ‌కుడు నాయ‌క‌త్వం వ‌హించాడు.

ఈ క్ర‌మంలోనే ఆ కార్మికులు చందాలు పోగేసుకుని సొంతంగా షాహీద్ అనే పేరిట హాస్పిట‌ల్‌ను క‌ట్టుకున్నారు. అందుకు ప‌లువురు డాక్ట‌ర్లు కూడా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి సేవ‌లను అందించ‌డం మొద‌లు పెట్టారు. అలా ఆ హాస్పిట‌ల్ ఆ కార్మికుల‌కు సేవ‌లందిస్తూ వస్తోంది. ఇప్ప‌టికీ ఆ హాస్పిట‌ల్ న‌డుస్తూనే ఉంది. దానికి కావ‌ల్సిన నిధులను దాత‌లు, స్వ‌చ్చంద సంస్థ‌లు అందిస్తుండ‌డంతో ఇప్పుడు ఆ హాస్పిట‌ల్ కార్పొరేట్ హాస్పిట‌ల్ లా మారింది. ఏది ఏమైనా కార్మికులే సొంతంగా త‌మ డ‌బ్బుల‌తో త‌మ కోసం హాస్పిట‌ల్‌ను క‌ట్టుకోవ‌డం అంటే మాట‌లు కాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top