వాట్సాప్ లో వాయిస్ కాలింగ్ ఫీచ‌ర్‌లో ఉన్న ఈ స్పెషాలిటీని మీరు గ‌మ‌నించారా ? తెలుసుకొని ట్రై చేయండి!

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో త‌న యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది. అందుక‌నే ఇప్పుడు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ల‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంది. ఇత‌ర ఎన్ని యాప్‌లు వ‌చ్చినా, ఏ ఫీచ‌ర్లు తెచ్చినా అవ‌న్నీ వాట్సాప్‌కు పోటీగా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. అందుకే వాట్సాప్‌ను వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.

వాట్సాప్‌లో యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న ఎన్నో ఫీచ‌ర్ల‌లో ఒక‌టి వాయిస్ కాలింగ్‌. నిజానికి ఈ ఫీచ‌ర్ ఎప్పుడో అందులో అందుబాటులోకి వ‌చ్చింది. కానీ మ‌రి ఇప్పుడు దీని గురించి అంత‌లా ఎందుకు చెప్ప‌డం అంటే.. అవును, చెప్పాలి. వాయిస్ కాలింగ్‌కు సంబంధించి ఒక విశేషం ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో అవ‌త‌లి వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఉన్న‌ప్పుడు అత‌నికి కాల్ చేస్తే స్క్రీన్‌పై రింగింగ్ అని క‌నిపిస్తుంది. అదే అవ‌త‌లి వ్య‌క్తి ఆన్‌లైన్‌లో లేక‌పోతే అత‌నికి వాట్సాప్‌లో వాయిస్ కాల్ చేస్తే మ‌న వాట్సాప్ స్క్రీన్‌పై కాలింగ్ అని క‌నిపిస్తుంది. అవును, క‌రెక్టే. కావాలంటే మీరూ దీన్ని ట్రై చేసి చూడండి. వాయిస్ కాలింగ్ కు సంబంధించి వాట్సాప్‌లో ఉన్న విశేష‌మే ఇది. దీన్ని అంద‌రికీ షేర్ చేసి తెలియ‌జేయండి.

Comments

comments

Share this post

scroll to top