ఎవరు మారాలి? ఎందుకు మారాలి?? మార్పు ఎక్కడ రావాలి???

ఇది వాట్సాప్ లో బాగా షేర్ అవుతున్న టెక్ట్స్ మెసేజ్. ఎవరు మారాలి? ఎందుకు మారాలి? మార్పు ఎక్కడి నుండి రావాలి? అని చాలా ఆలోచనాత్మకంగా ప్రశ్నించిన మెసేజ్ ఇది.

 

  • ఎవడు? ఎవడు? మారాలి
  • మారాలి, మారాలి అంటాం.ఎవరు ముందు మారాల్సింది?
  • మనకు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలి.
  • కష్టపడకుండానే ఫలితం రావాలి.
  • మందు, మాంసం తినాలి కానీ ఆరోగ్యం బాగుండాలి.
  • పొగ త్రాగాలి కానీ క్యాన్సర్ రాకూడదు.
  • పొద్దునలేచి అరగంట వ్యాయామం చేయడం చేతకాదు కానీ 60 ఏళ్ళదాకా యవ్వనంగా ఉండాలి.
  • ఓటు వేయడం చేతకాదు కానీ దేశం మారిపోవాలి.
  • తిరగబడే దమ్ములేదు కానీ అవినీతి అంతమవ్వాలి.
  • కాలుష్యం పెరుగుతుందని విసుక్కుంటాం కానీ పుట్టిన రోజు నాడైన ఒక మొక్కలను నాటం.
  • లంచగొండితనం హద్దులు మీరుతుందని మధనపడతాం,
  • అవసరమైనప్పుడు అదే లంచమిచ్చి పని చేయించుకుంటాం,
  • అవకాశం దొరికితే అదే లంచం పుచ్చుకుంటాం.
  • సమాజంలో స్వార్ధం పెరుగిందని ఆక్రోశిస్తాం కానీ కొత్త కరెన్సీ నోట్లను పర్సులో, బీరువాలో దాచుకుంటం.
  • పౌరహక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతుంటం కానీ కళ్ళ ముందు క్రైమ్ జరిగిన సాక్షం చెప్పడానికి భయపడి చస్తాం.
  • అన్నం మనం తినాలి కానీ పొట్ట వేరేవారికి పెరగాలి.
  • మనం చికెన్ కూడా త్యాగం చేయం కానీ మన నాయకులు గాంధేయవాదులుగా ఉండాలి.
  • మన నాయకులు వ్యాయామం చేయాలి కానీ మనకు పొట్ట తగ్గాలి.
  • మనం మన భార్య పిల్లలతో ఇంట్లో సంతోషంగా ఉండాలి కానీ మన నాయకులు మన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండాలి.
  • ఇప్పుడు చెప్పు, ఎవరు ముందు మారాలి?
  • స్వార్ధం ఎవరు విడిచిపెట్టాలి?

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top